Armoor Municipal Commissioner | ఆర్మూర్​ మున్సిపల్ కమిషనర్​గా శ్రీహరి రాజు బాధ్యతల స్వీకరణ

Shashi kiran Mottala

అక్షరటుడే ఆర్మూర్ : Armoor Municipal Commissioner | ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్​గా శ్రీహరి రాజు (Srihari Raju) సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఉమామహేశ్వరరావు బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే.

Armoor Municipal Commissioner | బాన్సువాడ నుంచి..

ఉమామహేశ్వర్​రావు స్థానంలో బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజును ప్రభుత్వం ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్​గా నియమించింది. దీంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ముందుగా మున్సిపల్ ఉద్యోగులు నూతన కమిషనర్​కు స్వాగతం పలికారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్​ పరిధిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కాగా.. నూతన కమిషనర్​గా బాధ్యతలు స్వీకరించిన శ్రీహరి రాజుకు మున్సిపల్ ఛైర్​పర్సన్ గోనె లహరి (Gone Lahari) శుభాకాంక్షలు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Collectorate | కలెక్టరేట్​లో కలకలం.. మహిళ ఆత్మహత్యాయత్నం..

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *