అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Cash Theft | డబ్బులు లెక్కపెట్టిస్తామంటూ దుండగులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఈ ఘటన పట్టణంలోని (Kamareddy) విద్యానగర్ సాయిబాబా ఆలయ రహదారిలో ఉన్న ఇందిరానగర్ ఎస్బీఐ బ్రాంచ్ వద్ద మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
Kamareddy Cash Theft | తండ్రీకూతురు కలిసి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఎస్బీఐ బ్యాంక్‌కు(SBI bank) వచ్చిన పాల్వంచ మండలం వాడి గ్రామానికి చెందిన చింతకింది పూజ తన తండ్రితో కలిసి ఎస్బీఐ బ్రాంచ్‌లో రూ.50 వేలు డ్రా చేశారు. బయటకు వచ్చి కౌంటర్ వద్ద డబ్బులు లెక్కిస్తుండగా, వెనుక నుంచి వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మేము లెక్కపెట్టి ఇస్తాము.. తప్పులు రాకుండా ఉంటాయని తండ్రీకూతురు దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. మాటలతో వారిని మభ్యపెట్టి చాకచక్యంగా లెక్కించినట్లుగా నటించారు. ఆ క్రమంలో రూ.15 వేలు తమ వద్ద దాచుకుని మిగిలిన రూ.35 వేలు మాత్రమే వారి చేతికి ఇచ్చి అక్కడి నుంచి నిష్క్రమించారు. మళ్లీ లెక్కించి చూడగా నగదు తక్కువగా ఉండడంతో విషయం అర్థమైంది. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు వెంటనే కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి బ్యాంకు పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యాక్టర్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్