నిజామాబాద్Police misconduct complaint | పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఐజీ, హెచ్​ఆర్​సీకి సర్పంచ్​ ఫిర్యాదు

Police misconduct complaint | పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఐజీ, హెచ్​ఆర్​సీకి సర్పంచ్​ ఫిర్యాదు

న్యాయం చేయాలని వెళ్లిన తన బెదిరింపు ధోరణితో మాట్లాడి దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని రాజంపేట మండలం ఆర్గొండ సర్పంచ్ విక్రాంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు మానవహక్కుల సంఘాన్ని, ఐజీ చంద్రశేఖర్​ రెడ్డిని కోరారు.

అక్షరటుడే, కామారెడ్డి: Police misconduct complaint | న్యాయం చేయాలని వెళ్లిన తనపై బెదిరింపు ధోరణితో మాట్లాడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని రాజంపేట (Rajampet) మండలం ఆర్గొండ సర్పంచ్ విక్రాంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు మానవహక్కుల సంఘంతో పాటు ఐజీ చంద్రశేఖర్​ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.

Police misconduct complaint | కామారెడ్డి పట్టణంలో..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతనెల 18న కామారెడ్డి పట్టణంలో (Kamareddy Police) ఆర్గొండ గ్రామానికి చెందిన వ్యక్తి ఐదేళ్ల కుమారుడు హత్యకు గురయ్యాడన్నారు. ఈ కేసులో బాలుడి తండ్రి నుంచి ఫిర్యాదు తీసుకోవడానికి కామారెడ్డి పోలీసులు నిరాకరిస్తున్నారని తెలుసుకుని తాను బాధితుడి తరపున సర్పంచ్​ హోదాలో కామారెడ్డి పట్టణ పోలీస్​స్టేషన్​కు వెళ్లానన్నారు. అయితే బాధిత తండ్రి నుంచి ఫిర్యాదు తీసుకోకుండా తనపై ఎఫ్ఐఆర్ బుక్ చేసి లోపల వేస్తానని పోలీసులు బెదిరించారని.. అక్కడే ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లు తనపై దాడి చేశారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై గత నెల 21న జరిగిన ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని (SP Rajesh Chandra) కలిసి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తక్షణమే ఈ ఘటనపై విచారణకు ఆదేశించి తనకు న్యాయం చేయాలని ఐజీ, హ్యూమన్ రైట్స్ కమిషన్​కు కోరానన్నారు.

ఇది కూడా చదవండి: Krishna Water Protest | కృష్ణ జలాల కోసం టీఆర్​ఎస్​ పోరుబాట

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Traffic staff health | ట్రాఫిక్​ సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి: సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Traffic staff health | ఎండాకాలంలో ట్రాఫిక్​...

Farmers Protest | ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతుల రాస్తారోకో

అక్షరటుడే, డిచ్​పల్లి: Farmers Protest | వరి కోతలు పూర్తవడంతో అన్నదాతలు...

Raja Singh | కొందరి స్వార్థంతో తెలంగాణలో బీజేపీ ఎదగడం లేదు : ఎమ్మెల్యే రాజాసింగ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Raja Singh | బీజేపీ (BJP) నేతలపై...

ACB Case | ఇంటి పర్మిషన్​ కోసం రూ.5 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన జూనియర్​ అసిస్టెంట్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Case | రాష్ట్రంలో అవినీతి అధికారులు...