అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tamil Nadu Election Results | తమిళనాడు రాజకీయాల్లో ఈసారి సంచలన ఫలితాలు నమోదయ్యాయి. తమిళగ వెట్రి కజగం (Tamilaga Vettri Kazhagam) పార్టీ అనూహ్యంగా దూసుకెళ్లి మొత్తం 234 స్థానాల్లో 108 స్థానాలు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అధికారంలో ఉన్న డీఎంకే 73 స్థానాలకు, ఏఐఏడీఎంకే 53 స్థానాలకు పరిమితం కావడం విశేషం.
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు టీవీకే ఇంకా 10 స్థానాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో, కాంగ్రెస్ మద్దతు కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠభరితంగా నిలిచిన నియోజకవర్గం తిరుపత్తూర్. డీఎంకే అభ్యర్థి, సహకార శాఖ మంత్రి కె.ఆర్. పెరియకరుప్పన్ (K. R. Periyakaruppan) కేవలం ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి శ్రీనివాస్ సేతుపతి 83,375 ఓట్లు సాధించగా, పెరియకరుప్పన్‌కు 83,374 ఓట్లు మాత్రమే లభించాయి. ఈ ఒక్క ఓటు తేడా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
Tamil Nadu Election Results | ఒక్క ఓటు తేడాతో..
కౌంటింగ్ ప్రక్రియ మొత్తం అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ప్రతి రౌండ్‌లో ఆధిక్యం మారుతూ రావడంతో చివరి క్షణం వరకూ ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. చివరికి శ్రీనివాస సేతుపతి (Srinivasa Sethupati) ఒక్క ఓటుతో విజయం సాధించడం ఎన్నికల ఉత్కంఠను మరింత పెంచింది. తిరుపత్తూర్ నియోజకవర్గం పెరియకరుప్పన్‌కు కంచుకోటగా పేరుంది. ఆయన 2006, 2011, 2016, 2021 ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వచ్చారు. అయితే ఈసారి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే ఈ సీటులో పోటీ చేయకుండా బీజేపీకి కేటాయించింది. బీజేపీ అభ్యర్థి కేసీ తిరుమారన్ పోటీ చేసినప్పటికీ మూడో స్థానానికి పరిమితమయ్యారు.
Tamil Nadu Election Results | అనేక అనూహ్య పరిణామాలు..
అయితే నటుడు విజయ్ (Vijay) నేతృత్వంలోని టీవీకే పార్టీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది అని చెప్పాలి. ఈ సారి ఎన్నికలలో 108 స్థానాలను గెలుచుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించగా, డీఎంకే కూటమి 73 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. అన్నాడీఎంకే 53 స్థానాల్లో విజయం సాధించింది. కాగా ఒక్క ఓటు రాజకీయ ముఖచిత్రాన్ని ఎలా మార్చగలదో పెరియకరుప్పన్ ఓటమి తెలియజేసింది. మొత్తంగా, తమిళనాడు ఎన్నికలు ఈసారి అనేక అనూహ్య పరిణామాలకు వేదికయ్యాయి.
ఇది కూడా చదవండి..: Kalita Majhi MLA | పనిమనిషి నుంచి ఎమ్మెల్యేగా కలితా మాఝీ విజయం

