అక్షరటుడే, వెబ్‌డెస్క్: Transfers | రాష్ట్ర ప్రభుత్వం (State Government) కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు అదనపు కలెక్టర్లను బదిలీ చేసింది. మొత్తం 27 మందిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో అదనపు కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు.
Transfers | బదిలీ అయిన అధికారులు వీరే..
వెయిటింగ్లో ఉన్న బి.హరిసింగ్‌ను సూర్యపేట అదనపు కలెక్టర్‌గా బదిలీ చేశారు. సంగారెడ్డి అదనపు కలెక్టర్ ఆర్డీ మాధురిని నల్గొండ స్పెషల్ కలెక్టర్‌గా నియమించారు. హెచ్ఎండీఏలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న అదనపు కలెక్టర్ డి.రాజ్యలక్ష్మిని పెద్దపల్లి అదనపు కలెక్టర్‌గా పంపించారు. కామారెడ్డి డీఆర్వో సీహెచ్.మధుమోహన్‌ను గద్వాల్ అదనపు కలెక్టర్‌గా బదిలీ చేశారు. రంగారెడ్డి డీఆర్వో టీఎల్.సంగీతను సంగారెడ్డి అదనపు కలెక్టర్‌గా నియమించారు. వెయిటింగ్లో ఉన్న వి.హనుమానాయక్‌ను వరంగల్ స్పెషల్ కలెక్టర్‌గా పంపించారు. హైదరాబాద్ ఎస్‌డీసీలో ఉన్న ఎం.సుర్యప్రకాశ్ను వనపర్తి డీఆర్వోగా ట్రాన్స్పర్ చేశారు. సిరిసల్ల ఆర్డీవో సీహెచ్.వెంకటేశ్వర్లును జనగామ డీఆర్వోగా బదిలీ చేశారు.
Transfers | మహబూబాబాద్ డీఆర్వోగా..
వెయిటింగ్లో ఉన్న బి.వసంత కుమారిని భూపాలపల్లి డీఆర్వోగా నియమించారు. హైదరాబాద్ ఎస్ఏటీజీలో పనిచేస్తున్న ఎస్.పద్మావతిని భద్రాద్రి కొత్తగూడెం డీఆర్వోగా పంపించారు. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న వి.రమాదేవిని సిరిసల్ల డీఆర్వోగా బదిలీ చేశారు. మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న జుబేద్ ఉన్నీసాబేగంను మహబూబాబాద్ డీఆర్వోగా ట్రాన్స్ఫర్ చేశారు. పెద్దపల్లి అదనపు కలెక్టర్ డి.వేణును ఆసిఫాబాద్ డీఆర్వోగా నియమించారు. వెయిటింగ్లో ఉన్న బి.స్రవంతిని ఆదిలాబాద్ డీఆర్వోగా పంపించారు. మైనారిటీ వెల్ఫేర్‌లో పనిచేస్తున్న ఎస్.రాజేశ్వరిని నారాయణపేట డీఆర్వో బదిలీ చేశారు. హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న కె.శ్రీనివాస్‌ను హన్మకొండ డీఆర్వోగా బదిలీ చేశారు. మహబూబ్‌నగర్ స్పెషల్ కలెక్టర్‌గా ఉన్న ఎల్.రమేశ్‌ను నారాయణపేట ఆర్డీవోగా ట్రాన్స్ఫర్ చేశారు.
‘కుడా’లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న రవీందర్ రెడ్డిని బాన్సువాడ ఆర్డీవోగా నియమించారు. టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐలో పనిచేస్తున్న బి.గీతను నిజామాబాద్ డీఆర్వోగా పంపించారు. సివిల్స్ సప్లయ్స్‌లో పనిచేస్తున్న జి.అంబాదాస్‌ను మెదక్ డీఆర్వోగా ట్రాన్స్ఫర్ చేశారు. డిప్యూటేషన్‌పై హెచ్ఎండీలో పనిచేస్తున్న ఎం.షర్మిలను ఉట్నూరు ఆర్డీవోగా బదిలీ చేశారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్స్‌లో పనిచేస్తున్న ఎం.విజయ కుమారి బోధన్ ఆర్డీవోగా నియమితులయ్యారు. దేవరకొండ ఆర్డీవో ఎస్.రమణారెడ్డిని మిర్యాలగూడ ఆర్డీవోగా పంపించారు. ‘రెరా’లో పనిచేస్తున్న దొనకంటి రవీందర్‌ను కాటారం ఆర్డీవోగా ట్రాన్స్ఫర్ చేశారు. టీటీడబ్యలూఆర్ఈఐఎస్లో ఉన్న ఎన్.రాజేందర్ రెడ్డిని సిరిసల్ల ఆర్డీవోగా పంపించారు. వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కే.ఎస్.బీ.కుమారిని వేములవాడ ఆర్డీవోగా నియమించారు. హెచ్ఎండీఏలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న పి.పద్మప్రియను దేవరకొండ ఆర్డీవోగా బదిలీ చేశారు.
ఇది కూడా చదవండి..: Weather Update | వాతావరణ శాఖ చల్లని కబురు.. తెలంగాణకు వర్ష సూచన

