అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nitish Rana Dismissal | ఐపీఎల్ 2026 (IPL 2026)లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ – చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మధ్య జరిగిన మ్యాచ్‌లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ బ్యాట్స్‌మన్ నితీష్ రానా అవుట్ అయిన తీరు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రానా, నూర్ అహ్మద్ వేసిన బంతిని ఆడే ప్రయత్నంలో గాల్లోకి లిఫ్ట్ చేశాడు.
అదే సమయంలో బ్యాలెన్స్ కోల్పోయి తన కాలు వికెట్‌ను తాకడంతో బెయిల్స్ కిందపడ్డాయి. ఇదే సమయంలో ఫీల్డర్ కార్తిక్ శర్మ క్యాచ్ అందుకోవడంతో, సాంకేతికంగా హిట్ వికెట్ మరియు క్యాచ్ అవుట్ రెండూ ఒకేసారి నమోదయ్యాయి. క్రికెట్ చరిత్రలో చాలా అరుదుగా కనిపించే ఈ ఘటన మ్యాచ్ హైలైట్‌గా నిలిచింది. రానా 13 బంతుల్లో 15 పరుగులు చేసి వెనుదిరిగాడు.
Nitish Rana Dismissal | ఢిల్లీకి షాకింగ్ ఆరంభం
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)కు ప్రారంభం నిరాశాజనకంగా మారింది. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కేఎల్ రాహుల్ కేవలం 12 పరుగులకే ఔటవ్వగా, ఓపెనర్ పాతుమ్ నిస్సాంక 19 పరుగులకే పరిమితమయ్యాడు. చెన్నై బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో ఢిల్లీ టాప్ ఆర్డర్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా నూర్ అహ్మద్ స్పిన్ దాడి ప్రభావం చూపింది. ఢిల్లీ జట్టు ఒక దశలో తక్కువ స్కోరుకే పరిమితమవుతుందని అనిపించిన సమయంలో, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Nitish Rana Dismissal | చెన్నై సూపర్ కింగ్స్ తరపున నూర్ అహ్మద్
రిజ్వీ కేవలం 24 బంతుల్లో 40 పరుగులు చేసి మెరుపులు మెరిపించగా, స్టబ్స్ 31 పరుగులతో సహకరించాడు. వీరి ఇన్నింగ్స్ ఢిల్లీ స్కోరును గౌరవప్రద స్థాయికి తీసుకెళ్లాయి. చివర్లో ఆశుతోష్ శర్మ (14), కరుణ్ నాయర్ (12) చిన్నస్కోర్స్ చేసిన కీలక పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ప్రారంభంలో తడబడినప్పటికీ, మధ్య ఓవర్లలో భాగస్వామ్యాలతో జట్టు పోటీ స్కోరును నమోదు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ తరపున నూర్ అహ్మద్ కీలక బౌలర్‌గా నిలిచి రెండు వికెట్లు తీశాడు. అతనికి తోడుగా ముఖేష్ చౌదరి, అఖిల్ హుస్సేన్, గుర్జప్‌నీత్ సింగ్, జేమీ ఓవర్‌టన్ ఒక్కో వికెట్ సాధించి ఢిల్లీ బ్యాటింగ్‌ను కట్టడి చేశారు. నెమ్మదైన పిచ్‌పై 156 పరుగుల లక్ష్యం సవాలుతో కూడుకున్నదే అయినప్పటికీ, చెన్నై బ్యాట్స్‌మెన్ దీనిని సులువుగా చేధించారు.ముఖ్యంగా సంజూ శాంసన్ అద్భుతమైన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ని గెలిపించాడు.
ఇది కూడా చదవండి..: Mumbai Playoff Chances | ఊపిరి పీల్చుకున్న ముంబై.. లక్నోపై గెలుపుతో ప్లేఆఫ్ ఆశలు సజీవం

