Wedding Car Accident | కాసేపట్లో కొడుకు పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులకు గాయాలు

Srinivas Kolluri

అక్షరటుడే, కామారెడ్డి : Wedding Car Accident | కాసేపట్లో కొడుకు పెళ్లి. ఇంటినుంచి బందువులంతా బయలుదేరుతున్నారు. పెళ్లికి సమయం కావస్తుండటంతో ఓ కారులో పెళ్లికొడుకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బయలుదేరారు.

10 నిమిషాల్లో ఫంక్షన్ హాలుకు చేరుకునేలోగా వేగంగా వెళ్తున్న కారు కల్వర్టును ఢీకొని 8 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి మండలం (Kamareddy Mandal) చిన్నమల్లారెడ్డి గ్రామ శివారులో బుధవారం చోటుచేసుకుంది.

రాజంపేట మండలం (Rajampet Mandal) ఆర్గొండ గ్రామానికి చెందిన చిదుర సిద్దిరాములు కొడుకు చిదుర భరత్ వివాహం కామారెడ్డి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో జరగనుంది. ఈ క్రమంలో పెళ్లికొడుకు తల్లిదండ్రులు, అతని సోదరి, ముగ్గురు చిన్నారులు కలిసి 8 మందితో కారులో ఫంక్షన్ హాలుకు బయలుదేరారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామ శివారులోని పెట్రోల్ బంక్ దాటిన తర్వాత వీరి కారు రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జుకాగా అందులో ఉన్న 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Wedding Car Accident | ఆస్పత్రికి తరలింపు

స్థానికులు గమనించి వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్​లో ఆస్పత్రికి తరలించారు. పెళ్లికొడుకు తల్లీదండ్రులు వినోద, సిద్ధిరాములుకు తీవ్ర గాయాలు అయ్యాయి. మేనత్త పరిస్థితి విషమంగా ఉంది. మరికొంతమంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన కల్వర్టు పక్కనే ట్రాన్స్​ఫార్మర్ కూడా ఉంది. కల్వర్టును కాకుండా ట్రాన్స్​ఫార్మర్​ను ఢీకొని ఉంటే పెను ప్రమాదం సంభవించేదని స్థానికులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Tandur single window | తాండూరు సింగిల్ విండో ఛైర్మన్‌గా ఆకిడి గంగారెడ్డి.. హైకోర్టు తీర్పుతో తిరిగి బాధ్యతలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *