Stock Market Updates | ఒడిదుడుకుల్లో మార్కెట్లు..

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Updates | ఇరాన్‌తో ఒప్పందం విషయంలో పురోగతి ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించడంతో గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి.

క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర దిగిరావడం, రూపాయి విలువ బలపడడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సైతం లాభాలతో ప్రారంభమైంది. అయితే ఇన్వెస్టర్లు మాత్రం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ సూచీలకు అనుగుణంగా మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభమైనా ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుకింగ్ కు ప్రాధాన్యత ఇస్తుండƒడంతో ప్రారంభ లాభాలు తగ్గాయి.

Stock Market Updates | గ్యాప్ అప్ లో ప్రారంభం..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) బుధవారం గ్యాప్ అప్ లో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 407 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 251 పాయింట్లు పెరిగింది. ప్రాఫిట్ బుకింగ్ కారణంగా అక్కడినుంచి 522 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 139 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 79 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల నుంచి 154 పాయింట్లు పడిపోయింది. ఉదయం 11.10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 129 పాయింట్ల లాభంతో 77,146 వద్ద, నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 24,087 వద్ద ఉన్నాయి.

Stock Market Updates | మిక్స్ డ్ గా సూచీలు..

దేశీయ స్టాక్ మార్కెట్ లోని ఇండెక్స్‌లు మిక్స్ డ్‌గా స్పందిస్తున్నాయి. నిఫ్టీలో టెలికాం ఇండెక్స్ 2.28 శాతం, రియాలిటీ 0.94 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.83 శాతం, బ్యాంక్ నిఫ్టీ 0.78 శాతం, మెటల్ 0.64 శాతం, ఐటీ 0.61 శాతం లాభాలతో ఉండగా.. పవర్ 0.89 శాతం, యుటిలిటీ 0.72 శాతం, ఎఫ్ ఎంసీఈ 0.68 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 21 స్టాక్స్ లాభాలతో, 9 స్టాక్ట్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇండిగో 3.12 శాతం, ట్రెంట్ 2.90 శాతం, ఎంఅండ్ ఎం 1.80 శాతం, ఆసియన్ పెయింట్ 1.64 శాతం, ఎయిర్ టెల్ 1.42 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ఎల్ టీ 3.12 శాతం, టైటాన్ 1.32 శాతం, హెచ్ యÖఎల్ 1.26 శాతం, రిలయన్స్ 1.10 శాతం, పవర్ గ్రిడ్ 1.02 శాతం నష్టంతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: May 06 Gold Rates | రూ. 1.5 లక్షల దిగువకు బంగారం ధర.. కొనుగోలుదారులకు ఊరట!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *