క్రైంHyderabad Restaurant Attack|సరూర్‌నగర్‌లో రౌడీషీటర్ల బీభత్సం.. బిల్లు అడిగినందుకు కత్తులతో దాడి!

Hyderabad Restaurant Attack|సరూర్‌నగర్‌లో రౌడీషీటర్ల బీభత్సం.. బిల్లు అడిగినందుకు కత్తులతో దాడి!

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పరిధిలో ఉన్న ఒక రెస్టారెంట్‌లో బిల్లు అడిగినందుకు రౌడీషీటర్లు రెచ్చిపోయారు.

అక్షరటుడే వెబ్‌డెస్క్:Hyderabad Restaurant Attack|హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పరిధిలో ఉన్న ఒక రెస్టారెంట్‌లో బిల్లు అడిగినందుకు రౌడీషీటర్లు రెచ్చిపోయారు. హోటల్ సిబ్బందిపై కత్తులు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Hyderabad Restaurant Attack|బిల్లు అడిగితే దాడి..

మే 2వ తేదీన సరూర్‌నగర్‌లోని ‘అర్బన్ రెస్టారెంట్’కు వచ్చిన కొందరు వ్యక్తులు భోజనం చేసిన తర్వాత బిల్లు చెల్లించకుండా వెళ్లబోయారు. హోటల్ సిబ్బంది బిల్లు చెల్లించమని కోరగా, ఆగ్రహానికి గురైన నిందితులు సిబ్బందిపై ఘర్షణకు దిగారు. అక్కడితో ఆగకుండా నిందితులు తమ వెంట తెచ్చుకున్న కత్తులు, కర్రలతో హోటల్ సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. ఈ దారుణ ఘటనలో పలువురు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Hyderabad Restaurant Attack|వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ ..

ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు హోటల్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. తాజాగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు, కస్టమర్లు భయాందోళనకు గురవుతున్నారు.

Hyderabad Restaurant Attack|పోలీసుల విచారణ..

పోలీసుల కథనం ప్రకారం, దాడికి పాల్పడింది రౌడీషీటర్లుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నగరంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Jubilee Hills Honeytrap | జూబ్లీహిల్స్‌లో హనీ ట్రాప్ గ్యాంగ్ బాగోతం.. తల్లి-కొడుకుల గలీజ్ దందా వెలుగులోకి

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Police Transfers Kamareddy | జిల్లాలో భారీగా పోలీసుల బదిలీలు

అక్షరటుడే, కామారెడ్డి: Police Transfers Kamareddy | కామారెడ్డి జిల్లా పోలీసు...

Trump Warning | ఒప్పందానికి అంగీకరించకపోతే ఇరాన్​పై దాడులు : ట్రంప్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Warning | ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసిందని...

Summer special camps | ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి ప్రత్యేక శిబిరాలు: డీఈవో రాజు

అక్షరటుడే, కామారెడ్డి: Summer special camps | జిల్లాలోని 6 నుండి...

Election Commission Case | సుప్రీంకోర్టులో కేంద్రానికి షాక్.. ఆ విన్నపాన్ని తోసిపుచ్చిన ధర్మాసనం!

అక్షరటుడే వెబ్‌డెస్క్: Election Commission Case| కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌...