అక్షరటుడే, వెబ్‌డెస్క్ : TVK AIADMK Alliance | తమిళనాడు (Tamilnadu)లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల్లో దళపతి విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాలు గెలుపొంది విషయం తెలిసిందే. మ్యాజిక్ ఫిగర్‌కు ఆ పార్టీకి మరో 10 మంది ఎమ్మెల్యేల అవసరం. ఈ క్రమంలో అన్నాడీఎంకే టీవీకేకు మద్దతు ఇవ్వనున్నట్లు సమాచారం.
టీవీకే ప్రధాన కార్యదర్శి, విజయ్ సన్నిహితుడు ఎన్. ఆనంద్ బుధవారం ఏఐఏడీఎంకే నాయకుడు ఎడప్పాడి కె. పళనిస్వామిని కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తన వాదనను వినిపించడానికి విజయ్ (Vijay) మధ్యాహ్నం 2 గంటలకల్లా లోక్‌భవన్‌కు చేరుకుంటారని భావిస్తున్నారు. ఏఐఏడీఎంకేలో అసమ్మతి ఉండవచ్చనే ఊహాగానాల నేపథ్యంలో, టీవీకేకు మద్దతు ఇవ్వాలని ఎడప్పాడి కె. పళనిస్వామిపై ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా వద్దా అనేది విజయ్ నిర్ణయించుకోవాల్సి ఉంటుందని చెబుతూ, పళనిస్వామి కూడా తన వైఖరిని కొంత మెత్తబరచుకున్నట్లు కనిపించారు.
TVK AIADMK Alliance | మే 7 ప్రమాణం
టీవీకే పార్టీ అధినేత విజయ్ మే 7న తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగే అవకాశం ఉంది. తమిళనాడులో లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు TVK అధినేత తిరు విజయ్‌కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ (Congress) రాజకీయ వ్యవహారాల కమిటీ బుధవారం ఏకగ్రీవంగా నిర్ణయించింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కాంగ్రెస్ నిర్వహించిన వర్చువల్ సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కాంగ్రెస్ 5 స్థానాల్లో విజయం సాధించింది. ఆ పార్టీ మద్దతు ఇచ్చినా మరో ఐదుగురు ఎమ్మెల్యేలు అవసరం. ఈ క్రమంలో ఏఐడీఎంకే మద్దతు తీసుకుంటే భవిష్యత్‌లో కూడా ఇబ్బందులు ఉండవని టీవీకే భావిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి..: Punjab Blasts|పంజాబ్‌లో వరుస పేలుళ్ల కలకలం.. సైనిక స్థావరాల వద్ద హై అలర్ట్!

