తెలంగాణPaddy Farmers | ప్రాణాలు పోతున్న పట్టదా.. కొనుగోలు కేంద్రాల్లో చనిపోతున్న రైతులు

Paddy Farmers | ప్రాణాలు పోతున్న పట్టదా.. కొనుగోలు కేంద్రాల్లో చనిపోతున్న రైతులు

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Paddy Farmers | ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం, ఇతర పంటలను అమ్ముకోవడానికి అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. పంటలు కోసి నెల రోజులు అవుతున్నా.. ధాన్యం కొనడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు.

రాష్ట్రంలో యాసంగిలో ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేశారు. మక్కలు, శనగలు సైతం కొందరు వేశారు. అయితే పంటల కొనుగోళ్లు సక్రమంగా సాగడం లేదు. ఓ వైపు ఎండలు, మరోవైపు అకాల వర్షాలు కురుస్తుండటంతో రైతులు (Farmers) ధాన్యం రాశుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో పలువురు మృతి చెందారు. తాజాగా అకాల వర్షం నుంచి పంటలను కాపాడుకోవడానికి వెళ్లి లక్షెట్టిపేటలో నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే.

గాలివాన రావడంతో బుధవారం ఉదయం ధాన్యం కుప్పల వద్దకు వెళ్లిన రైతులు.. అక్కడ ఓ షెడ్​లో నిల్చోగా వానకు అది కూలిపోయింది. దీంతో నలుగురు చనిపోయారు. ఇటీవల మెదక్​ జిల్లా (Medak District) హవేళి ఘన్​పూర్​ మండలం బూర్గుపల్లిలో ధాన్యం కుప్ప వద్ద పిడుగు పడి చింతల శ్రీనివాస్​ అనే రైతు మృతి చెందాడు. నకిరేకల్​ పట్టణంలో ఓ రైతు చనిపోయాడు. ఇలా రైతులు చనిపోతున్నా.. ధాన్యం కొనుగోళ్లలో మాత్రం వేగం పెంచడం లేదు.

Paddy Farmers | లారీలు రాక..

ధాన్యం కొనుగోళ్లు నత్తనడనక సాగుతున్నాయి. లారీలు రాకపోవడంతో కాంటాలు వేసిన బస్తాలు పేరుకుపోతున్నాయి. దీంతో కొత్తగా కాంటా చేయడం లేదు. కేంద్రానికి ధాన్యం తెచ్చి నెల రోజులు అవుతున్నా కాంటా కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.

Paddy Farmers | రైస్​ మిల్లర్ల దోపిడీ

ఇప్పటికే కొనుగోళ్లు సక్రమంగా జరగక రైతులు ఇబ్బందులు పడుతుంటే, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్​ మిల్లర్లు వారిని దోపిడీ చేస్తున్నారు. 40 కిలోల బస్తాకు 43 కిలోల వరకు తూకం వేస్తున్నారు. అలాగే మిల్లుకు వెళ్లిన తర్వాత తరుగు పేరిట లారీకి కొన్ని బస్తాలను తీసేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయినా అధికారులు అటువైపు చూడటం లేదు. కొనుగోళ్లు వేగంగా జరిగేలా చర్యలు చేపట్టాలని రైతుతు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: Railway Bypass Launch | రైల్వే బైపాస్​ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Minimum Pension Hike | కనీస పెన్షన్ రూ. 7,500.. పెంపు యోచనలో కేంద్ర ప్రభుత్వం!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Minimum Pension Hike | ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న...

Education Fee Regulation| విద్య వ్యాపారం కావొద్దు.. ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిందే: కవిత

అక్షరటుడే వెబ్‌డెస్క్:Education Fee Regulation|సమాజంలో సమానత్వం , స్వేచ్ఛ కేవలం నాణ్యమైన...

Samsung Market Cap | ట్రిలియన్ డాలర్ల క్లబ్ లోకి శాంసంగ్.. రెండో ఆసియా కంపెనీగా రికార్డ్

అక్షరటుడే, వెబ్​డెస్క్: Samsung Market Cap | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial...