Journalist accreditation cards | ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జర్నలిస్టులకు అక్రెడిటేషన్​ కార్డులు: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Journalist accreditation cards | ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జర్నలిస్టులకు అక్రెడిటేషన్​ కార్డులు అందుతాయని కలెక్టర్​ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. నగరంలోని కలెక్టరేట్​లో బుధవారం అక్రెడిటేషన్​ కమిటీ (accreditation committee) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

Journalist accreditation cards | పారదర్శకంగా..

ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. 2026-28 కాల వ్యవధికి గాను ఆన్​లైన్​లో సమర్పించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. జీ.వో.252 ప్రకారం నిబంధనలకు లోబడి అర్హులకు కమిటీ సభ్యులు ఆమోదం తెలుపగా.. కమిటీ ఛైర్ పర్సన్​గా మంజూరు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు అర్హులైన జర్నలిస్టులకు జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ ఆధ్వర్యంలో కార్డులు జారీ జరుగుతుందన్నారు.

తదుపరి వచ్చే దరఖాస్తులను కూడా ఇదే తరహాలో క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు మంజూరయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా పౌర సంబంధాల అధికారిణి (District Public Relations Officer) ఎన్.పద్మశ్రీ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్​ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ ఎం.ఉమేష్ చంద్రరావు, ఆర్టీసీ (Nizamabad RTC) పీవో పద్మజ, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు ఏ.నర్సింలు, ఆర్.భూపతి, జి.సాయి ప్రసాద్, సీహెచ్.జాన్సన్, ఎంఏ.మాజిద్, కే.రాందయానంద్, ఎండీ గౌస్, ఎల్.బాల్ కుమార్, ఎస్.శ్రీకాంత్, ఎన్.శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: GCPL | గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అద్భుతమైన ఆర్థిక ఫలితాలు.. డబుల్ డిజిట్ వృద్ధి నమోదు!

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *