తెలంగాణMetro Phase 2 | మెట్రో ఫేజ్​–2కు ఆమోదం తెలపాలి.. కేంద్ర మంత్రిని కోరిన సీఎం

Metro Phase 2 | మెట్రో ఫేజ్​–2కు ఆమోదం తెలపాలి.. కేంద్ర మంత్రిని కోరిన సీఎం

హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆమోదం తెల‌పాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌ ను కోరారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Metro Phase 2 | హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆమోదం తెల‌పాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌ ను కోరారు. ఏడు కారిడార్ల‌తో కూడిన స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌ను రూపొందించి డీపీఆర్‌ను ఇప్ప‌టికే స‌మ‌ర్పించామ‌ని తెలిపారు.

ఢిల్లీ (Delhi) పర్యటనలో ఉన్న సీఎం బుధవారం కేంద్ర మంత్రితో సమావేశం అయ్యారు. హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌ -II, మెట్రో ఫేజ్‌ -III పై చ‌ర్చించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న న‌గ‌రంలో ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం మెట్రోను విస్త‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. రెండు, మూడో దశ పనులు సజావుగా సాగాలనే ఎల్​అండ్​టీ సంస్థ నుంచి హైదరాబాద్​ మెట్రో (Hyderabad Metro)ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

Metro Phase 2 | రూ.38 వేల కోట్లతో..

రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్ -IIలో ఏడు కారిడార్లతో మొత్తం 122.9 కిలోమీటర్ల మేర విస్తరణకు రూ.38,595 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన డీపీఆర్‌ను ఇప్ప‌టికే కేంద్రానికి సమర్పించిందని సీఎం పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్​ను భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా చేప‌ట్టేందుకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర మంత్రిని విజ్ఞ‌ప్తి చేశారు.

Metro Phase 2 | ఫేజ్​–3 కోసం..

న‌గ‌ర భ‌విష్య‌త్ అవ‌స‌రాల దృష్ట్యా ఎయిర్‌పోర్ట్ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ కారిడార్‌ను మెట్రో ఫేజ్ -IIIగా చేపట్టాలని రేవంత్​ రెడ్డి కోరారు. మెట్రో ఫేజ్-III కి సంబంధించిన డీపీఆర్‌ను కూడా ఇప్ప‌టికే స‌మ‌ర్పించామ‌న్నారు. ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి బి.అజిత్ రెడ్డి, మెట్రో ఎండీ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ఎన్‌.వి.ఎస్‌.రెడ్డి పాల్గొన్నారు.

దీనిని కూడా చదవండి : Telangana Nominated Posts | తెలంగాణలో నామినేటెడ్​ పదవుల భర్తీ..

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Police Transfers Kamareddy | జిల్లాలో భారీగా పోలీసుల బదిలీలు

అక్షరటుడే, కామారెడ్డి: Police Transfers Kamareddy | కామారెడ్డి జిల్లా పోలీసు...

Trump Warning | ఒప్పందానికి అంగీకరించకపోతే ఇరాన్​పై దాడులు : ట్రంప్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Warning | ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసిందని...

Summer special camps | ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి ప్రత్యేక శిబిరాలు: డీఈవో రాజు

అక్షరటుడే, కామారెడ్డి: Summer special camps | జిల్లాలోని 6 నుండి...

Election Commission Case | సుప్రీంకోర్టులో కేంద్రానికి షాక్.. ఆ విన్నపాన్ని తోసిపుచ్చిన ధర్మాసనం!

అక్షరటుడే వెబ్‌డెస్క్: Election Commission Case| కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌...