Trump Warning | ఒప్పందానికి అంగీకరించకపోతే ఇరాన్​పై దాడులు : ట్రంప్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Warning | ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) అందరికీ అందుబాటులోకి వస్తుందని బుధవారం తెలిపారు.

ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌లో ట్రంప్ ఇలా అన్నారు. ఒప్పందం కుదిరిన దానికి ఇరాన్ (Iran) అంగీకరిస్తుందని అనుకుంటే, అది బహుశా ఒక పెద్ద ఊహే కావచ్చు, అప్పటికే ప్రసిద్ధి చెందిన ‘ఎపిక్ ఫ్యూరీ’ ముగుస్తుందన్నారు. అత్యంత ప్రభావవంతమైన దిగ్బంధనం వల్ల ఇరాన్‌తో సహా అందరికీ హర్ముజ్ జలసంధి అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. వారు అంగీకరించకపోతే, బాంబు దాడులు ప్రారంభమవుతాయని హెచ్చరించారు. దాడులు గతంలో కంటే చాలా ఎక్కువ స్థాయిలో, తీవ్రతతో ఉంటాయన్నారు.

Trump Warning | తగ్గని ఉద్రిక్తతలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఇరాన్​ – అమెరికా మధ్య కాల్పుల విరమణ కుదిరినా.. టెన్షన్​ మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలో ఒప్పందానికి అంగీకరించకపోతే దాడులు తీవ్రం చేస్తామని ట్రంప్​ హెచ్చరించడం గమనార్హం. దీంతో మరోసారి ఆందోళన నెలకొంది. కాల్పుల విరమణతో ఇప్పుడిప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు చక్కబడుతున్నాయి. ముడి చమురు ధరలు దిగి వస్తున్నాయి. ఈ క్రమంలో ట్రంప్​ హెచ్చరికలతో మరోసారి ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.

 

దీనిని కూడా చదవండి : Iran UAE drone attack | ఫుజైరా ఆయిల్ హబ్‌పై ఇరాన్ డ్రోన్ దాడి.. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *