Police Transfers Kamareddy | జిల్లాలో భారీగా పోలీసుల బదిలీలు

Shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Police Transfers Kamareddy | కామారెడ్డి జిల్లా పోలీసు శాఖలో భారీగా బదిలీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) ఆధ్వర్యంలో 146 మంది సిబ్బందికి కౌన్సెలింగ్ ద్వారా స్థానచలనం కల్పించారు.

Police Transfers Kamareddy |ఉత్కంఠకు తెర..

దీంతో పోలీస్​శాఖలో బదిలీలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కామారెడ్డి(Kamareddy), ఎల్లారెడ్డి, బాన్సువాడ సబ్ డివిజన్‌ల పరిధిలోని 8 మంది ఏఎస్సైలు, 18 హెడ్ కానిస్టేబుళ్లు, 111 కానిస్టేబుళ్లు, ఎంటీ విభాగానికి చెందిన 9 మందికి కొత్త పోస్టింగ్‌లు ఇచ్చారు.

Police Transfers Kamareddy | మానవీయ కోణంలో..

జిల్లా పోలీసుశాఖలో బదిలీలు మానవీయ కోణంలో చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసిన కానిస్టేబుళ్లు, నాలుగేళ్లు పూర్తిచేసిన హెడ్ కానిస్టేబుళ్లు, మూడేళ్లు పూర్తిచేసిన ఏఎస్సైలతో పాటు పదోన్నతులు పొందిన వారితో ఎస్పీ స్వయంగా మాట్లాడారు. కుటుంబ పరిస్థితులు, స్పౌస్ ఉద్యోగం, ఆరోగ్య సమస్యలు, సీనియారిటీ, విల్లింగ్ స్టేషన్లను పరిగణనలోకి తీసుకొని బదిలీలు చేపట్టడం విశేషం. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. బదిలీ అంటే శిక్ష కాదని, కొత్త బాధ్యతని తెలిపారు. పారదర్శకత ఉంటేనే విధుల్లో నిబద్ధత వస్తుందని, నైతికత, నిజాయితీతో ప్రజల నమ్మకం గెలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ మధుసూధన్, ఆర్‌ఐలు సంతోష్ కుమార్, నవీన్ కుమార్, కృష్ణ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Trump Warning | ఒప్పందానికి అంగీకరించకపోతే ఇరాన్​పై దాడులు : ట్రంప్​

 

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *