జాతీయంWest Bengal Political Violence | పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ నెత్తురోడిన రాజకీయం.. బీజేపీ నేత...

West Bengal Political Violence | పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ నెత్తురోడిన రాజకీయం.. బీజేపీ నేత సువేందు పీఏ దారుణ హత్య

పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ హత్యలు, హింసాత్మక ఘటనలు మళ్లీ పెరుగుతున్నాయన్న ఆందోళన ఈ హత్యోదంతంతో మరింత తీవ్రతరమైంది. రాష్ట్ర రాజకీయాలు మరోసారి భయానక మలుపు తిరిగాయన్న చర్చ కొనసాగుతోంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: West Bengal Political Violence | పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి రక్తంతో తడిసి ముద్దయ్యాయి. రాష్ట్రంలో పెరుగుతున్న రాజకీయ హింసకు నిదర్శనంగా మరో ఘటన చోటుచేసుకుంది. బీజేపీ కీలక నేత, ముఖ్యమంత్రి అభ్యర్థి సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్‌ దారుణ హత్యకు గురికావడం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది.

West Bengal Political Violence | మధ్యమ్‌గ్రామ్ ప్రాంతంలో

ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్ ప్రాంతంలో బుధవారం (మే 06) రాత్రి ఈ ఘోర సంఘటన జరిగింది. కారులో ప్రయాణిస్తున్న చంద్రనాథ్ రథ్‌పై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. తుపాకీ గుళ్ల వర్షం కురిపించారు. బుల్లెట్స్​ శరీరాన్ని ఛేదించడంతో చంద్రనాథ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. ఆయన మరణించినట్లు చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

దుండగుల కాల్పుల్లో బుద్ధదేవ్ అనే వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఘటనాస్థలిలో భయానక వాతావరణం నెలకొనగా, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

West Bengal Political Violence | “పక్కా ప్రణాళిక రాజకీయ హత్య”గా

ఈ హత్య వెనుక రాజకీయ కోణం ఉందా..? లేదా వ్యక్తిగత వైరమా..? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, సువేందు అధికారి సీఎం రేసులో ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఈ దారుణ హత్యోదంతం చర్చనీయాంశంగా మారింది. ఆయనకు అత్యంత సన్నిహితుడే ఘోరంగా అంతమవడం రాజకీయ వర్గాల్లో అనుమానాలకు దారితీస్తోంది.

ఈ ఘటనను బీజేపీ నేతలు “పక్కా ప్రణాళిక రాజకీయ హత్య”గా అభివర్ణిస్తూ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో నాయకుల భద్రత పూర్తిగా ప్రశ్నార్థకంగా మారిందని వాపోతున్నారు.

ఇదిలా ఉంటే, ఘటన అనంతరం మధ్యమ్‌గ్రామ్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. దుండగుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు.

Tamil Nadu Hung Assembly | అన్నా డీఎంకే – డీఎంకే చర్చలు..! ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్రత్యర్థులు?

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Yellareddy Road Accident | ఎల్లారెడ్డి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం – చెట్టును ఢీకొని వ్యక్తి మృతి

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Road Accident | మండలంలోని (Yellareddy) కొత్త...

Kodandaram TJS Meeting|ప్రజా సమస్యలపై పోరాటమే టీజేఎస్ లక్ష్యం: ఎమ్మెల్సీ కోదండరాం

Kodandaram TJS Meeting|గత ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించడమే కాకుండా, తెలంగాణ...

Operation Sindoor | ఉగ్రవాదంపై పోరాటం కొనసాగుతుంది : భారత ఆర్మీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ నిర్వహించి ఏడాది...

Mega Job Mela | మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Mega Job Mela | మెగా...