బిజినెస్​TVS iQube S | సరికొత్తగా టీవీఎస్ ఐక్యూబ్ .. 175 కి.మీ రేంజ్ తో...

TVS iQube S | సరికొత్తగా టీవీఎస్ ఐక్యూబ్ .. 175 కి.మీ రేంజ్ తో విడుదల

టీవీఎస్ మోటార్ కంపెనీ తన బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కొత్త వేరియంట్ ను తీసుకువచ్చింది. ఐక్యూబ్ ఎస్ 4.7(కేడబ్ల్యూహెచ్ ) మోడల్ ను విడుదల చేసింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: TVS iQube S | ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ (TVS Motor).. ఈవీ మార్కెట్ లో దూసుకుపోతోంది. తన ఎలక్ట్రిక్ స్కూటర్ పోర్ట్ ఫోలియోను మరింత విస్తరిస్తూ ఐక్యూబ్ సిరీస్‌ (iQube Series)లో కొత్త వేరియంట్ ను తీసుకువచ్చింది. బ్యాటరీ సామర్థ్యాన్ని మెరుగుపరచడంతోపాటు ఆకర్షణీయమైన రంగులలో దీనిని అందుబాటులోకి తెచ్చింది.

TVS iQube S | బ్యాటరీ సామర్థ్యం..

ఈ స్కూటర్ లో అమర్చిన 4.7 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ 5.9 హెచ్‌పీ శక్తిని, 33 ఎనఎం టార్క్‌ను అందిస్తుంది. గంటకు 82 కి.మీ.. గరిష్ఠ వేగంతో ప్రయాణించవచ్చు. ఇది 4.3 సెకన్లలోనే 0 నుంచి 40 కి.మీ. వేగాన్ని అందుకుంటుందని కంపెనీ చెబుతోంది.
పోర్టబుల్ చార్జర్‌తో 0 నుంచి 80 శాతం చార్జింగ్ కావడానికి 4 గంటల సమయం పడుతుంది.

రేంజ్ : ఐడీసీ(IDC) సర్టిఫికేషన్ ప్రకారం ఈ స్కూటర్ ఒక్కసారి పూర్తిస్థాయిలో చార్జ్ చేస్తే 175 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.

కలర్ ఆప్షన్లు : మాగ్నిఫిసెన్స్ పర్పుల్ బీజ్ , హార్లెక్విన్ బ్లూ బీజ్ , టైటానియం గ్రే మ్యాట్ వంటి సరికొత్త కలర్ ఆప్షన్లలో కొత్త వేరియంట్ ను తీసుకువచ్చారు.

ధర : ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధరను రూ.1,37,142 గా నిర్ణయించారు.

TVS iQube S | ఇతర ఫీచర్లు..

ఇందులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్ సపోర్ట్, రైడ్ అనలిటిక్స్, నోటిఫికేషన్స్, రివర్స్ మోడ్, క్రాష్ అలర్ట్, ఫాల్ అలర్ట్, యాంటీ థెఫ్ట్ అలర్ట్ వంటి ఫీచర్లున్నాయి.

ఇది కూడా చదవండి..: Today Stock Market | ఒడిదుడుకుల్లో మార్కెట్లు..

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Labour Card Benefits | భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు ద్వారా సంక్షేమ ఫలాలు పొందాలి

అక్షరటుడే, బాన్సువాడ: Labour Card Benefits | భవన నిర్మాణ కార్మికులు...

Paddy Procurement Transport | లారీలు అందుబాటులో ఉంచాలి.. ధాన్యం కొనుగోళ్లపై కీలక ఆదేశాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Paddy Procurement Transport | రాష్ట్రంలో ధాన్యం...

Kamareddy Co-option Election | కొనసాగిన కాంగ్రెస్​..బీఆర్​ఎస్​ బంధం.. ముగిసిన కామారెడ్డి కోఆప్షన్​ ఎన్నిక

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Co-option Election | కామారెడ్డి మున్సిపాలిటీలో (kamareddy...

Olympiad Education | బంగారు భవితకు పునాది.. విద్యార్థుల విజయానికి స్వర్ణ మార్గం.. ఒలంపియాడ్‌ విద్య 

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Olympiad Education | నేటి వేగవంతమైన ఆధునిక ప్రపంచంలో...