Vehicle Sales India | వాహనాల అమ్మకాలలో జోరు.. గతనెలలో 26 లక్షల యూనిట్ల విక్రయం

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vehicle Sales India | భారత ఆటో రిటైల్ రంగం 2026–27 ఆర్థిక సంవత్సరాన్ని బలంగా ప్రారంభించింది. దేశీయంగా వాహన రిటైల్ విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగాయి. గతేడాది ఏప్రిల్‌తో పోల్చితే ఈ ఏడాది ఏప్రిల్‌లో 12.94 శాతం వృద్ధి నమోదయ్యింది.

గతేడాది ఏప్రిల్‌లో 23,12,221 యూనిట్లు అమ్ముడవగా.. ఈసారి 26,11,317 యూనిట్లకు పెరగడం గమనార్హం. ఈ విషయాన్ని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) వెల్లడించింది. ఆర్ బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు, జీఎస్టీ సంస్కరణలు (GST Reforms), వివాహాల సీజన్ వంటి అంశాలు ఈ వృద్ధికి ప్రధాన కారణాలని పేర్కొంది.

Vehicle Sales India | కేటగిరీలవారీగా..

గతనెలలో 26,11,317 వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో టూ వీలర్లు 19.16 లక్షలు, ప్యాసింజర్ కార్లు 4.07 లక్షలు, కమర్షియల్ వెహికిల్స్ సుమారు లక్ష, త్రీవీలర్లు 1.06 లక్షలు, ట్రాక్టర్లు 75 వేలు ఉన్నాయి.

Vehicle Sales India | పల్లెల్లోనూ అదే స్పీడు…

గతంలో వాహనాల కొనుగోళ్లు ఎక్కువగా పట్టణ ప్రాంతాలలనే జరిగేవి. గ్రామాలలో వాహనాలు తక్కువగా ఉండేవి. అయితే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడం, మార్కెట్ లో లిక్విడిటీ కారణంగా పల్లెల్లోనూ వాహనాల జోరు పెరిగింది. గతేడాది ఏప్రిల్ తో పోల్చితే ఈ ఏడాది ఏప్రిల్‌లో పట్టణ ప్రాంతాల్లో వాహనాల అమ్మకాలలో వృద్ధి 7.11 శాతం నమోదైతే, గ్రామీణ ప్రాంతాల్లో ఇది 20.40 శాతంగా ఉంది.

Vehicle Sales India | చిన్న కార్ల హవా..

కరోనా తర్వాత కార్ల కొనుగోళ్లపై ప్రజల ఆసక్తి పెరిగింది. దీంతో చిన్న కార్లకు డిమాండ్ ఏర్పడింది. ఎస్‌యూవీల హవా కొనసాగుతున్నప్పటికీ, చిన్న కార్ల విభాగంలో మళ్లీ కొనుగోళ్లు పెరగడంతో ‘వ్యక్తిగత మొబిలిటీ’ విభాగం పుంజుకుంది. పెట్రోల్, డీజిల్ వాహనాలే కాకుండా ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలవైపూ మొగ్గు చూపుతున్నారు. దీంతో సీఎన్‌జీ వాహనాల వాటా 22.62 శాతం, ఎలక్ట్రిక్ వాహనాల వాటా 5.77 శాతం పెరిగాయి. వచ్చే 3 నెలల్లో వాహనాల విక్రయాల స్పీడ్ ఇలాగే కొనసాగవచ్చని ఫాడా అంచనాలు వేస్తోంది. ఈ నెలలో వివాహాల సీజన్ కారణంగా ప్యాసింజర్ వాహనాల బుకింగ్‌లు బలంగా ఉంటాయని భావిస్తోంది.

ఇది కూడా చదవండి..: Vivo X300 FE 5G | వీవో నుంచి ప్రీమియం ఫోన్

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *