నిజామాబాద్Labour Card Benefits | భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు ద్వారా సంక్షేమ ఫలాలు...

Labour Card Benefits | భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు ద్వారా సంక్షేమ ఫలాలు పొందాలి

భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా సహాయ కార్మిక శాఖ అధికారి ఎం.శశికుమార్ సూచించారు.

అక్షరటుడే, బాన్సువాడ: Labour Card Benefits | భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు (labour card) ద్వారా కల్పించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సహాయ కార్మిక శాఖ అధికారి ఎం.శశికుమార్ పిలుపునిచ్చారు. పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయం వద్ద కార్మిక శాఖ (labour department) ఆధ్వర్యంలో గురువారం భవన నిర్మాణ కార్మికుల (construction workers) అవగాహన సమావేశం నిర్వహించారు.

Labour Card Benefits | కార్మికుల వెల్ఫేర్​ బోర్డు ద్వారా..

తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుబాస్ రాములు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో లేబర్​ అధికారి మాట్లాడుతూ.. ఈనెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కార్మికులకు వెల్ఫేర్ బోర్డు (Workers Welfare Board) ద్వారా అందిస్తున్న పథకాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. భవన నిర్మాణ కార్మికులను వెల్ఫేర్ బోర్డులో సభ్యులుగా చేర్చి అనేక ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామన్నారు. లేబర్ కార్డు కలిగిన కార్మికుడు సహజ మరణం చెందితే రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. అలాగే కార్మికుల పిల్లలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో కాన్పులకు రూ.30 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మొదటి, రెండో కుమార్తెల వివాహాలకు కూడా ప్రత్యేక ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. కార్మికులు తప్పనిసరిగా లేబర్ కార్డు పొందాలని ఆయన సూచించారు. బాన్సువాడ సహాయ కార్మిక శాఖ అధికారి ఇబ్రహీం జుబేర్ మాట్లాడుతూ.. లేబర్ కార్డు ద్వారా కార్మికులకు అనేక సంక్షేమ ప్రయోజనాలు లభిస్తాయని, నిర్మాణ రంగ కార్మికులందరూ నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కార్మిక శాఖ జూనియర్ అసిస్టెంట్లు సతీష్ రెడ్డి, దావుద్, తాపీ మేస్త్రీ సంఘం నాయకులు గడ్డి వెంకటేశ్వర్లు, తోట శ్రీనివాస్, సర్దార్, ఏఐటీయూసీ నాయకులు శంకర్, కమ్మరి రాములు, నల్ల గంగాధర్, నీలి శంకర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Paddy Procurement Transport | లారీలు అందుబాటులో ఉంచాలి.. ధాన్యం కొనుగోళ్లపై కీలక ఆదేశాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Disaster Mock Drill | విపత్తుల సన్నద్ధతపై మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Disaster Mock Drill | ప్రకృతి విపత్తులు...

Bengal Cabinet Dissolved | బెంగాల్​ మంత్రివర్గాన్ని రద్దు చేసిన గవర్నర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bengal Cabinet Dissolved | బెంగాల్‌ కేబినెట్‌ను...

Yellareddy Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొని ఒకరి దుర్మరణం..

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Road Accident | మండలంలోని (Yellareddy) కొత్త...

Kodandaram TJS Meeting | ప్రజా సమస్యలపై పోరాటమే టీజేఎస్ లక్ష్యం: ఎమ్మెల్సీ కోదండరాం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kodandaram TJS Meeting| గత ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించడమే...