Instagram Encryption Removed|మెటా సంచలన నిర్ణయం..ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫీచర్ నిలిపివేత

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:Instagram Encryption Removed|సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ తన ఫోటో , వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక మార్పు చేపట్టింది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల వ్యక్తిగత సంభాషణలకు రక్షణగా ఉండే ‘ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్’ (End-to-End Encryption) సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మే 8, 2026 నుండి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది.

Instagram Encryption Removed|ఇక పై ఆ సౌకర్యం లేదు..

ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్‌ను వినియోగించే వారి సంఖ్య ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెటా సమర్థించుకుంది. సాధారణంగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటే, పంపిన వారు , స్వీకరించే వారు తప్ప మూడో వ్యక్తి (చివరికి మెటా కూడా) ఆ సందేశాలను చూడటానికి లేదా వినడానికి వీలుండదు. అయితే, ఇకపై ఇన్‌స్టాగ్రామ్ చాట్స్‌లో ఈ సౌకర్యం ఉండదు.

Instagram Encryption Removed|యూజర్ల ప్రైవసీకి భంగం..

ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ ద్వారా అసాంఘిక కార్యకలాపాలు, పైరసీ, , బాలల దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్ అధికారుల కంటపడకుండా ప్రసారమవుతోందని ప్రపంచవ్యాప్తంగా నియంత్రణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చట్టవిరుద్ధమైన కంటెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సంస్థలు చేస్తున్న డిమాండ్ల నేపథ్యంలో మెటా ఈ ముందడుగు వేసింది. అయితే, డిజిటల్ హక్కుల కార్యకర్తలు మాత్రం ఇది యూజర్ల ప్రైవసీకి భంగం కలిగిస్తుందని వాదిస్తున్నారు.

Instagram Encryption Removed|యూజర్లు ఏం చేయాలి?

ఈ మార్పు వల్ల ప్రభావితమయ్యే చాట్‌లు ఉన్నవారు, తమ సందేశాలను లేదా మీడియా ఫైళ్లను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో మెటా సూచనలు ఇచ్చింది. ఇందుకోసం యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. పాత సందేశాల భవిష్యత్తుపై మెటా ఇంకా పూర్తి స్పష్టత ఇవ్వలేదు. కాగా, మెటాకు చెందిన మరో మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’లో మాత్రం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ యథావిధిగా కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: BC Caste Renaming|తెలంగాణలో పలు బీసీ కులాల పేర్లు మార్పు.. కొత్త పేర్ల జాబితా ఇదే

 

 

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *