జాతీయంTVK Government Formation| గవర్నర్ వైఖరిపై అసహనం.. కోర్టు మెట్లెక్కనున్న విజయ్

TVK Government Formation| గవర్నర్ వైఖరిపై అసహనం.. కోర్టు మెట్లెక్కనున్న విజయ్

తమిళనాడులో అధికారం చేపట్టేందుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ (మద్దతు) ప్రస్తుతానికి టీవీకే పార్టీకి లేదని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ స్పష్టం చేశారు.

అక్షరటుడు వెబ్‌డెస్క్:TVK Government Formation| తమిళనాడులో అధికారం చేపట్టేందుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ (మద్దతు) ప్రస్తుతానికి టీవీకే పార్టీకి లేదని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు లోక్‌భవన్ వర్గాలు గురువారం ఒక ప్రకటన విడుదల చేశాయి. 24 గంటల వ్యవధిలోనే విజయ్ రెండోసారి గవర్నర్‌తో భేటీ కావడం గమనార్హం.

TVK Government Formation|గవర్నర్ – విజయ్ మధ్య రెండోసారి చర్చలు..

ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి బుధవారం జరిగిన చర్చల కొనసాగింపుగా, గురువారం లోక్‌భవన్‌కు రావాల్సిందిగా విజయ్‌ను గవర్నర్ ఆహ్వానించారు. ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మెజారిటీ నిరూపణపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మద్దతు పత్రాలు విజయ్ వద్ద లేవని గవర్నర్ ఈ సందర్భంగా వివరించినట్లు తెలుస్తోంది.

TVK Government Formation|చట్టపరంగా పోరాడడానికి సిద్దం..

మరోవైపు, గవర్నర్ తీరుపై టీవీకే వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. తమ వద్ద ఉన్న మద్దతును (మైనారిటీ వాదన) అంగీకరించేలా గవర్నర్‌పై ఒత్తిడి తెచ్చేందుకు తాము చట్టపరంగా పోరాడతామని పార్టీ వర్గాలు సంకేతాలిచ్చాయి. న్యాయపరంగా ఈ వ్యవహారాన్ని సవాలు చేసే హక్కు తమకు ఉందని విజయ్ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

TVK Government Formation|ట్విస్ట్ ఇచ్చిన వామపక్షాలు..

ఈ రాజకీయ సంక్షోభంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే కూటమిలో ఉన్న సీపీఐ, సీపీఐ(ఎం) , విదుతలై చిరుతైగళ్ కచ్చి (VCK) పార్టీలు విజయ్‌కు మద్దతు ఇచ్చే అంశంపై చర్చలు జరిపాయి. సీట్ల బదిలీకి సంబంధించి ఈ మూడు పార్టీల నేతలు గురువారం ఉదయం ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌తో భేటీ అయ్యారు. అయితే, తమ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా సొంతంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను స్టాలిన్ వారికి ఇచ్చినట్లు సమాచారం.

ఈ మద్దతు గనుక విజయ్‌కు లభిస్తే, తమిళనాడు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Telangana Law Order| హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్.. అందుకే రాష్ట్రంలో ఈ దారుణాలు: కేటీఆర్

 

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

May 09 Gold Prices | గోల్డ్ లవర్స్‌కు ఊరట.. రెండు రోజుల తర్వాత తగ్గిన బంగారం ధర!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 09 Gold Prices | దేశీయ మార్కెట్‌లో బంగారం...

CDS Raja Subramani | చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎన్‌ఎస్‌ రాజా సుబ్రమణి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: CDS Raja Subramani | కీలక సైనిక నియామకాన్ని...

May 09 Horoscope | గృహ సంబంధిత ఇన్వెస్ట్‌మెంట్‌.. భవిష్యత్తులో జాక్‌పాట్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 09 Horoscope | గ్రహాల గమనంలో కనిపిస్తున్న...

Cisco Abhilash Reddy Package | రూ. 2 కోట్ల వార్షిక వేతనం సాధించిన తెలంగాణ తేజం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Cisco Abhilash Reddy Package | పాలమూరు జిల్లా అడ్డాకుల...