అక్షరటుడే, వెబ్‌డెస్క్ : TVK Vijay | తమిళనాడు (Tamil Nadu)లో రాజకీయ ప్రతిష్ఠంభనకు తెర పడింది. మూడు రోజులుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెర పడింది. టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది.
టీవీకేకు సీపీఐ (CPI), సీపీఎం (CPM), వీసీకే మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 చోట్ల విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 118కి పది సీట్ల దూరంలో ఆగిపోయింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆ పార్టీని ఆహ్వానించలేదు. ముందే సంఖ్యాబలం చూపాలని కోరారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొనగా వామపక్ష పార్టీలు తాజాగా చర్చలు జరిపి టీవీకేకు మద్దతు తెలపడానికి ముందుకు వచ్చాయి.
TVK Vijay | బలాలు ఇలా..
ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో గెలుపొందింది. అందులో విజయ్ ఒక స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఆ పార్టీ బలం 107కు చేరింది. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ దళపతికి జై కొట్టింది. తాజాగా సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2 మద్దతు ఇచ్చాయి. దీంతో టీవీకే బలం 118కి చేరింది. మ్యాజిక్ ఫిగర్ దక్కడంతో విజయ్ సీఎం (CM Vijay)గా ప్రమాణం చేయనున్నారు.
TVK Vijay | గవర్నర్‌ను కలవనున్న విజయ్
ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మద్దతు సమకూరడంతో టీవీకే ఏర్పాట్లు చేసుకుంటుంది. ఈ మేరకు విజయ్ మరోసారి గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు గవర్నర్‌తో ఆయన సమావేశం కానున్నారు. ఇప్పటికే రెండుసార్లు గవర్నర్‌ను కలిశారు. అయితే సంఖ్యాబలం లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదు. తాజాగా ఆయా పార్టీలు మద్దతు తెలపడంతో గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించున్నారు. టీవీకే ఎమ్మెల్యే, విజయ్ కీలక సహాయకుడు ఆధవ్ అర్జున్ ఇప్పటికే పాటినపాక్కంలోని విజయ్ నివాసానికి చేరుకున్నారు.
దీనిని కూడా చదవండి : TARA Weapon Test | డీఆర్డీవో కీలక అడుగు.. తారా వెపన్ టెస్ట్ సక్సెస్

