బిజినెస్​Stock Market Losses | రోజంతా నష్టాల్లోనే..

Stock Market Losses | రోజంతా నష్టాల్లోనే..

దేశీయ స్టాక్ మార్కెట్‌లోని ప్రధాన సూచీలు రోజంతా నష్టాల్లోనే కొనసాగాయి. సెన్సెక్స్ 516 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్ల నష్టంతో ముగిశాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Losses | పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్‌ల మధ్య మళ్లీ పరస్పర దాడులు మొదలవడంతో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దీంతో గ్లోబల్ మార్కెట్లు (Global Markets) ఒత్తిడికి గురవుతున్నాయి.

దేశీయ ఇన్వెస్టర్లు సైతం అప్రమత్తంగా వ్యవహరించి, ప్రాఫిట్ బుకింగ్ కు ప్రాధాన్యత ఇవ్వడంతో దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సైతం నష్టాలతో ముగిసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) నాలుగో త్రైమాసికంలో అంచనాలను అందుకోకపోవడంతో బ్యాంక్ నిఫ్టీ ఒత్తిడికి గురయ్యింది. ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి విలువ బలహీన పడడం కూడా ప్రధాన సూచీలు నష్టాలతో ముగియడానికి కారణమయ్యాయి.

Stock Market Losses | నష్టాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 213 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 16 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి మరో 501 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 93 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 20 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల నుంచి 127 పాయింట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్ 516 పాయింట్ల నష్టంతో 77,328 వద్ద, నిఫ్టీ 150 పాయింట్ల నష్టంతో 24,176 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Losses | బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల్లో ఒత్తిడి..

బ్యాంకింగ్ , ఫైనాన్షియల్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బ్యాంక్ నిఫ్టీ 1.31 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.25 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.94 శాతం, ఎనర్జీ 0.92 శాతం, మెటల్ 0.87 శాతం నష్టపోగా.. కన్జూమర్ డ్యూరెబుల్స్ 2.01 శాతం, ఐటీ 1.21 శాతం లాభాలతో ముగిశాయి.

Stock Market Losses | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,068 కంపెనీలు లాభపడగా 2,148 స్టాక్స్ నష్టపోయాయి. 190 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 219 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 23 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 14 కంపెనీలు లాభాలతో, 16 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టైటాన్ 4.76 శాతం, ఆసియన్ పెయింట్ 2.79 శాతం, అదానీపోర్ట్స్ 1.58 శాతం, ఇన్ఫోసిస్ 1.44 శాతం, హెచ్ సీఎల్ టెక్ 1.28 శాతం లాభపడ్డాయి.

Top Losers : ఎస్బీఐ 6.62 శాతం, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ 1.84 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.80 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.78 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.55 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Maruti Car Offers | మారుతి కార్లపై భారీ ఆఫర్లు..

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

May 09 Gold Prices | గోల్డ్ లవర్స్‌కు ఊరట.. రెండు రోజుల తర్వాత తగ్గిన బంగారం ధర!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 09 Gold Prices | దేశీయ మార్కెట్‌లో బంగారం...

CDS Raja Subramani | చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎన్‌ఎస్‌ రాజా సుబ్రమణి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: CDS Raja Subramani | కీలక సైనిక నియామకాన్ని...

May 09 Horoscope | గృహ సంబంధిత ఇన్వెస్ట్‌మెంట్‌.. భవిష్యత్తులో జాక్‌పాట్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 09 Horoscope | గ్రహాల గమనంలో కనిపిస్తున్న...

Cisco Abhilash Reddy Package | రూ. 2 కోట్ల వార్షిక వేతనం సాధించిన తెలంగాణ తేజం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Cisco Abhilash Reddy Package | పాలమూరు జిల్లా అడ్డాకుల...