జాతీయంBird Flu in Maharashtra | మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి.. వేల కోళ్లను పూడ్చేసిన...

Bird Flu in Maharashtra | మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి.. వేల కోళ్లను పూడ్చేసిన అధికారులు..

మహారాష్ట్రలో బర్డ్​ఫ్లూ వ్యాప్తిస్తోంది. వ్యాధి పడిన కోళ్లు చనిపోతున్నాయి

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bird Flu in Maharashtra | మహారాష్ట్రలో బర్డ్​ఫ్లూ వ్యాప్తిస్తోంది. వ్యాధి పడిన కోళ్లు చనిపోతున్నాయి. మహారాష్ట్రలోని నందుర్‌బార్ జిల్లా (Nandurbar District) నవాపూర్‌ ప్రాంతంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందిందని అక్కడి అధికారులు తెలిపారు. బర్డ్ ఫ్లూను అదుపు చేసేందుకు రెండు రోజుల్లో 44 వేలకు పైగా కోళ్లను చంపి పూడ్చేశారు. అంతేకాకుండా 39 వేల గుడ్లు, 58 వేల కేజీల దాణాను పారబోశారు.

Bird Flu in Maharashtra | ప్రజల్లో ఆందోళన

మహారాష్ట్ర (Maharashtra)లో బర్డ్​ఫ్లూ విస్తరిస్తుండడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వేల సంఖ్యలో కోళ్లకు వ్యాధి సోకుతోంది. దీంతో అధికారులు వ్యాప్తిని కట్టి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వ్యాధి సోకిన కోళ్లను పూడ్చి పెడుతున్నారు. అలాగే వేల సంఖ్యలో గుడ్లను కూడా పడేస్తున్నారు.

Bird Flu in Maharashtra | కఠిన ఆంక్షలు అమలు

బడ్​ఫ్లూను గుర్తించిన ప్రాంతంలో కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. అంతేకాకుండా నష్టపోయిన రైతులకు పరిహారం అందజేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రాంతంలోని కోళ్ల ఫారాల యజమానులు కోళ్లను విక్రయించకూడదని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ప్రాంతానికి శివారులోని గుజరాత్​లోనూ వ్యాధి వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. కోళ్ల వ్యాపారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Bird Flu in Maharashtra | వ్యాపారంపై ప్రభావం

బడ్​ఫ్లూ వ్యాపిస్తుండడంతో వ్యాపారాలపై ప్రభావం చూపిస్తోంది. చికెన్​ షాపులు, హోటళ్లలో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. దీంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Vijay Thalapathy Prediction | విజయ్ దళపతిపై వేణుస్వామి సంచలన జోస్యం.. త్రిష లేకపోతే రిజల్ట్ వేరేలా..

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Government ITI Admissions | ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Government ITI Admissions | ప్రభుత్వ ఐటీఐ...

Bandi Bhagirath | కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి వివాదం..!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bandi Bhagirath | కేంద్రమంత్రి బండి సంజయ్​ కుమారుడు...

Car Tanker Blast | గ్యాస్ నింపుతుండగా పేలిన కారు ట్యాంకు.. మూడు కార్లు, బైక్​ దగ్ధం..

అక్షరటుడే, కామారెడ్డి: Car Tanker Blast | కార్లలో దొంగచాటుగా గ్యాస్​...

Biscuit Baba| కొత్తగా పుట్టుకొచ్చిన ‘బిస్కెట్ బాబా’.. భక్తి పేరుతో వికృత చేష్టలు

అక్షరటుడే వెబ్‌డెస్క్: Biscuit Baba | ప్రస్తుత ఆధునిక కాలంలో టెక్నాలజీ...