Suvendu Adhikari Oath | పశ్చిమ బెంగాల్ బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Suvendu Adhikari Oath | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు (CM Suvendu)అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. కోల్‌కతాలోని చారిత్రాత్మక ‘బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్’లో శనివారం సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. బెంగాల్​ గవర్నర్ ఆర్.ఎన్.రవి (Bengal Governor R.N. Ravi) ఆయనతో ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, ఇతర కేంద్ర మంత్రి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

Suvendu Adhikari Oath | వేడుకకు హాజరైన ప్రముఖులు

ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), కేంద్ర హోం మంత్రులు అమిత్​ షా, రాజ్​నాథ్​ సింగ్​, జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్​ నబిన్​, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, యోగి ఆదిత్యనాథ్‌, రేఖా గుప్తాలతో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.

Suvendu Adhikari Oath | బీజేపీ చారిత్రాత్మక విజయం

ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్​లో బీజేపీ చారిత్ర్మాక విజయం సాధించిన విషయం తెలిసిందే. 207 స్థానాలను కైవసం చేసుకుని, పశ్చిమ బెంగాల్‌లో ప్రాంతీయ రాజకీయ శక్తుల దీర్ఘకాలిక ఆధిపత్యానికి తెరదించి.. కొత్త రాజకీయ అధ్యాయానికి నాంది పలికింది.

Suvendu Adhikari Oath | అంచెలంచెలుగా ఎదిగిన సువేందు అధికారి

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సువేందు అధికారి అంచెలంచెలుగా ఎదిగారు. ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహిత సహచరుడిగా గుర్తింపు పొందిన ఆయన.. 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. 2021 ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన నందిగ్రామ్ పోరులో సువేందు అధికారి.. మమతా బెనర్జీని ఓడించి సంచలనం సృష్టించారు. ఇది ఆయన రాజకీయ జీవితంలో ఒక కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. తాజాగా కూడా ఆయన భవానిపూర్​లో మరోసారి మమతా బెనర్జీని మట్టికరింపించారు. బెంగాల్​లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దీంతో కేంద్ర బీజేపీ ఆయనకే ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టింది.

ఇది కూడా చదవండి..: Bird Flu in Maharashtra | మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి.. వేల కోళ్లను పూడ్చేసిన అధికారులు..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *