Electric Shock Death | పిండిగిర్ని శుభ్రం చేస్తుండగా విద్యుత్​షాక్​.. మహిళ మృతి

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Electric Shock Death | రుణం తీసుకుని ఉపాధి నిమిత్తం పిండి గిర్ని ఏర్పాటు చేసుకున్న ఓ మహిళ.. ఆ గిర్నిని (flour mill accident) శుభ్రంచేస్తూ విద్యుత్​షాక్​తో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన భిక్కనూరు (Bhikkanoor) మండలం పెద్ద మల్లారెడ్డిలో శనివారం చోటు చేసుకుంది.

Electric Shock Death | శుభ్రం చేస్తుండగా..

భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో బండి రేణుక (35) ఉపాధి నిమిత్తం రుణం తీసుకుని చిన్న పిండిగిర్ని ఏర్పాటు చేసుకుంది. ఈ క్రమంలో ఎప్పటిలాగే శనివారం ఉదయం గిర్ని స్టార్ట్​ చేసేముందు నీళ్లుచల్లి శుభ్రం చేస్తుండగా కరెంట్​షాక్​ కొట్టింది. దాంతో ఆమె అక్కడే కిందపడగా తలకు బలమైన గాయమైంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కామారెడ్డిలో (kamareddy) ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దాంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా.. మృతురాలి భర్త యోగేష్ గ్రామంలో చికెన్ సెంటర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Nara Lokesh Durga | ఇంద్రకీలాద్రిపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పూజలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *