Telangana Promo Run | ఆరోగ్యకరమైన జీవనశైలికి ‘పరుగు’ ఎంతో ఉపయోగకరం

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Telangana Promo Run | ఆరోగ్యకరమైన జీవనశైలికి (Healthy Lifestyle) రన్నింగ్​ ఎంతో ఉపయోగకరమని అదనపు డీసీపీ శుభం ప్రకాశ్​(Shubham Prakash) అన్నారు. నగరంలో సొసైటీ ఫర్​ తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో తొలి ప్రోమో రన్​ను (Nizamabad Run Event) ఏసీపీ ప్రకాశ్​తో కలిసి ఆయన ప్రారంభించారు.

Telangana Promo Run | క్రమశిక్షణ కలిగి ఉండాలి

ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకునేందుకు ఇలాంటి రన్నింగ్ కార్యక్రమాలు ఎంతో అవసరం అని వారు పేర్కొన్నారు. యువత ఫిట్‌నెస్, క్రమశిక్షణ వైపు మళ్లాలని, ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో మంచి మార్పునకు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఆర్పీ సూపర్​స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు. సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ (Society for Telangana Runners) కార్యదర్శి మగ్గారి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా రన్నింగ్ కల్చర్‌ను విస్తరించేందుకు, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు ‘తెలంగాణ రన్ టూర్’ను వివిధ జిల్లాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు.

నిజామాబాద్ ప్రజలు చూపిన విశేష స్పందన తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. త్వరలోనే నిజామాబాద్‌లో(Nizamabad) మరొక భారీ రన్ నిర్వహించనున్నట్లు సొసైటీ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, యువతీయువకులు పాల్గొన్నారు. రన్ అనంతరం విజేతలకు అతిథులు బహుమతులు అందజేయగా, నిర్వాహకులు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మెడల్స్, అల్పాహారం అందజేశారు.

Telangana Promo Run | సహకరించిన వారికి కృతజ్ఞతలు.. ఆర్పీ హాస్పిటల్స్​ అధినేత రాజేంద్రప్రసాద్​

ఆర్పీ సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రి (RP Super Specialty Hospital) ఎండీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యంపై అవగాహన పెంచే ఇలాంటి కార్యక్రమాలకు తమ సంస్థ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందన్నారు. డాక్టర్​ సీనునాయక్​ డెంటల్​ హాస్పటల్​ ఎండీ శ్రీను నాయక్, డా. హరి కృష్ణ (Paediatrician), రన్నర్లు రజినేష్, మహేష్, అభిషేక్, శ్రీనివాస్ ఈ రన్ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. కార్యక్రమంలో నిర్వాహకులు పన్నాల హరీష్ రెడ్డి, సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ సభ్యులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Revanth Reddy | తెలంగాణపై పెద్ద మనసు చూపండి.. ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి విన్నపం!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *