నిజామాబాద్Polytechnic Entrance Test | పాలిటెక్నిక్​ కామన్​ ఎంట్రెన్స్​ టెస్ట్​కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: సీపీ సాయిచైతన్య

Polytechnic Entrance Test | పాలిటెక్నిక్​ కామన్​ ఎంట్రెన్స్​ టెస్ట్​కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: సీపీ సాయిచైతన్య

పాలిటెక్నిక్​ కామన్​ ఎంట్రెన్స్​ టెస్ట్​కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Polytechnic Entrance Test | పాలిటెక్నిక్​ కామన్​ ఎంట్రెన్స్​ టెస్ట్​కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.

Polytechnic Entrance Test | నగరంలో 15 పరీక్ష కేంద్రాలు..

నిజామాబాద్ నగరంలో (Nizamabad City) ఈనెల 13న పరీక్ష జరుగనుందని.. మొత్తం 15 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారని సీపీ తెలియజేశారు. ప్రతి కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలు జరిగే రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కేంద్రం పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ (163 BNSS ) అమలులో ఉంటుందని వెల్లడించారు. పరీక్షా కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఇద్దరికి మించి గుంపులుగా తిరగడం నిషేధమన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని సంబంధిత యజమానులకు సూచనలు జారీ చేసినట్లు తెలిపారు.

Polytechnic Entrance Test | అనుమానాస్పద వ్యక్తులపై నిఘా..

పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తామని సీపీ తెలిపారు. కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచుతామన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Revanth Reddy | తెలంగాణపై పెద్ద మనసు చూపండి.. ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి విన్నపం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Siddipet Couple Suicide|సిద్దిపేటలో విషాదం.. పెళ్లైన నెలకే నవ దంపతుల ఆత్మహత్య

అక్షరటుడే వెబ్‌డెస్క్:Siddipet Couple Suicide|ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ జంట నూరేళ్లు...

Nizamabad Rural Police | భార్యాభర్తల గలీజు దందా.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Rural Police | సులభంగా డబ్బు...

Vijay Resignation | పెరంబూర్ ఎమ్మెల్యేగానే విజయ్.. తిరుచ్చి ఈస్ట్ పదవికి రాజీనామా

అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vijay Resignation |తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీవీకే...

Bandi Sanjay Comments | నా మీద కుట్ర పన్నారు.. బండి సంజయ్​ కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Sanjay Comments | కేంద్ర మంత్రి...