క్రైంSrinagar Theft Cases | శ్రీనగర్‌లో దొంగల బీభత్సం.. పలు ఇళ్లల్లో చోరీలు..

Srinagar Theft Cases | శ్రీనగర్‌లో దొంగల బీభత్సం.. పలు ఇళ్లల్లో చోరీలు..

దొంగలు బీభత్సం సృష్టించారు. వర్ని మండలంలోని శ్రీనగర్​ గ్రామంలో తొమ్మిది ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు.

అక్షరటుడే, బాన్సువాడ: Srinagar Theft Cases | దొంగలు బీభత్సం సృష్టించారు. వర్ని(varni) మండలంలోని శ్రీనగర్​ గ్రామంలో ఒకే రాత్రి తొమ్మిది ఇళ్లల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు.

Srinagar Theft Cases | భయాందోళనలో ప్రజలు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ని మండలంలోని శ్రీనగర్ గ్రామంలో శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పలు ఇళ్లల్లో చోరీలకు(House Burglaries) పాల్పడ్డారు. వరుసగా తొమ్మిది ఇళ్లలోకి చొరబడి అందినకాడికి దోచుకెళ్లారు. ఒకే రాత్రిలో ఇంత పెద్దఎత్తున దొంగతనాలు జరగడం స్థానికంగా సంచలనంగా మారింది. కొందరి ఇళ్లలో బీరువాలు, అల్మారాలు పగులగొట్టి నగదు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువుల కోసం వెతికిన ఆనవాళ్లు కనిపించాయి. ఉదయం గమనించిన ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు.

Srinagar Theft Cases | పోలీసుల దర్యాప్తు

ఘటనపై సమాచారం అందుకున్న సీసీఎస్(CCS Police) ఏసీపీ మస్తాన్ అలీ, ఇన్‌స్పెక్టర్ సురేష్, వర్ని ఎస్సై వంశీకృష్ణ రెడ్డి (varni police) వెంటనే గ్రామానికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఆధారాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. దొంగలు ఎంత మేరకు నగదు, బంగారం అపహరించారనే విషయంపై పోలీసులు విచారణ(Police Investigation) కొనసాగిస్తున్నారు. ఒకేసారి తొమ్మిది ఇళ్లలో చోరీలు జరగడం ఇదే మొదటిసారి అని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ ఘటనతో శ్రీనగర్ గ్రామ ప్రజలు రాత్రి వేళల్లో భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో పోలీస్ పహారా పెంచాలని, రాత్రి సమయంలో గస్తీ నిర్వహించాలని కోరారు.

ఇది కూడా చదవండి: Siddipet Couple Suicide|సిద్దిపేటలో విషాదం.. పెళ్లైన నెలకే నవ దంపతుల ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bharat Karth Accident | సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో నటుడు, కెమెరామెన్ దుర్మరణం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bharat Karth Accident | తెలుగు సినీ పరిశ్రమలో...

Work From Home | దేశ ప్రయోజనాల కోసం మళ్లీ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సంస్కృతి రావాలి : ప్రధాని Modi పిలుపు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Work From Home | అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు,...

Bandi Sanjay Allegations | ‘బాధితులను బండి సంజయ్ బెదిరించారు’.. ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ సంచలన ఆరోపణలు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bandi Sanjay Allegations | 'నీ బిడ్డ ఎంత మందితో...

BRS Party Meeting | 12న ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: BRS Party Meeting | భారతీయ రాష్ట్ర సమితి...