ఆంధ్రప్రదేశ్​Constable Murder Kakinada | నడిరోడ్డుపై కాపు కాసి.. గొంతు కోసి.. కానిస్టేబుల్‌ దారుణ హత్య

Constable Murder Kakinada | నడిరోడ్డుపై కాపు కాసి.. గొంతు కోసి.. కానిస్టేబుల్‌ దారుణ హత్య

నడిరోడ్డుపై రక్షణ కల్పించాల్సిన పోలీసుపైనే దాడి జరగడంతో సామాన్య ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Constable Murder Kakinada | ఆంధ్రప్రదేశ్​ AP లోని కాకినాడ నగరంలో అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. గాంధీనగర్ ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న పోలీస్ కానిస్టేబుల్‌ను గుర్తుతెలియని దుండగులు అత్యంత పాశవికంగా గొంతు కోసి హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Constable Murder Kakinada | పదునైన కత్తితో

పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పెషల్ పోలీస్ (APSP) విభాగానికి చెందిన నాగేశ్వరరావు గాంధీనగర్ వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా.. మాటు వేసిన దుండగులు ఒక్కసారిగా దాడికి దిగారు. పదునైన కత్తితో ఆయన గొంతు కోసి పారిపోయారు. తీవ్ర రక్తస్రావం కావడంతో నాగేశ్వరరావు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.

సమాచారం అందుకున్న జిల్లా పోలీసు ఉన్నతాధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సర్కారు దవాఖానా Hospital కు తరలించారు.

Constable Murder Kakinada | అన్ని కోణాల్లో దర్యాప్తు:

పోలీసులు Police దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ హత్య వెనుక ఏవైనా పాత కక్షలు ఉన్నాయా? అనే కోణంలో విచారిస్తున్నారు. విధుల నిర్వహణలో భాగంగా ఎవరితోనైనా గొడవలు జరిగాయా అన్నది ఆరా తీస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Bharat Karth Accident | సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో నటుడు, కెమెరామన్ దుర్మరణం

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Farmer Death Incident | సొంత పొలంలోనే మృత్యువాత.. బావిలో జారి పడి అన్నదాత అకాలమరణం..

అక్షరటుడే, కామారెడ్డి: Farmer Death Incident | సొంత వ్యవసాయ పొలం...

Mahabubnagar Road Accident | మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు దుర్మరణం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahabubnagar Road Accident | మహబూబ్‌నగర్ జిల్లా...

May 11 Market Analysis | మిక్స్‌డ్​గా గ్లోబల్ క్యూస్.. నెగెటివ్ ఓపెనింగ్​ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 11 Market Analysis | అమెరికా, ఇరాన్ (Iran)ల...