Rupee Under Pressure | తీవ్ర ఒత్తిడిలో రూపాయి..

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rupee Under Pressure | అంతర్జాతీయ ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలు పెరుగుతుండడం, ఎఫ్ ఐఐలు పెట్టుబడులు ఉపసంహరిస్తుండడంతో రూపాయి తీవ్ర ఒత్తిడికి గురవుతోంది.

డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ సోమవారం ఇంట్రాడేలో 95 స్థాయికి పడిపోయింది. ముడి చమురు (Crude oil) ధర ఇలాగే పెరిగితే రూపాయి మరింత పతనమయ్యే అవకాశాలున్నాయి. దీంతో త్వరలోనే సెంచరీ కొడుతుందా అన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే మన ఆర్థిక వ్యవస్థ మరింత ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది.

Rupee Under Pressure | రూపాయి ఎందుకు పడిపోతోందంటే..

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ (Donald Trump) రెండోసారి ఎన్నికయ్యాక కష్టాలు పెరిగాయి. ఎడాపెడా రెసిప్రోకల్ టారిఫ్స్ బాదడంతో ఎగుమతులు తగ్గి ద్రవ్యలోటు పెరిగింది. దీంతోపాటు అమెరికా, ఇరాన్‌ల మధ్య దాదాపు రెండున్నర నెలలుగా కొనసాగుతున్న యుద్ధంతో క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. సుమారు 60 శాతానికిపైగా పెరిగాయి. దీంతో మనం ఎక్కువ డాలర్లు చెల్లించి క్రూడ్ ఆయిల్ కొనాల్సి వస్తోంది. దీనివల్ల డాలర్‌కు డిమాండ్ పెరిగి రూపాయి బలహీనపడుతోంది. మరోవైపు రూపాయిలో బలహీనతతో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే రూ. 251 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు ఉపసంహరించారు. ఆరేళ్లలో రూ. 12.50 ýక్షల కోట్లను వెనక్కి తీసుకున్నారు. సౌత్‌కొరియా, తైవాన్ వంటి దేశాల మార్కెట్లు ఆకర్షణీయంగా మారడంతో అటువైపు వెళుతున్నారు.

Rupee Under Pressure | అత్యవసర చర్యలు..

రూపాయి మరింత బలహీనం కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంది. కేంద్ర బ్యాంక్ రూపాయి తన సహజమైన విలువను పొందేలా వదిలేసినట్లు కనిపిస్తున్నా.. పతనాన్ని అడ్డుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది. తీవ్రమైన విలువ పతనాన్ని నివారించడానికి డాలర్లను విక్రయించింది. అయినా పతనం ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఇంట్రాడేలో డాలర్ తో రూపాయి మారకం విలువ 95.23 కు పడిపోయింది.

ఇది కూడా చదవండి..: Motorbike Accident | ట్రాఫిక్​ సిగ్నల్​ పోల్​కు చిక్కుకున్న బైక్​

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *