Gold Traders Tension | బంగారం వ్యాపారుల్లో టెన్షన్.. రేపు పీఎంవో అధికారులతో భేటీ!

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold Traders Tension | రాబోయే ఏడాది కాలం పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోండి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రజలను కోరారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ పిలుపునిచ్చారు.

జియో పొలిటికల్ టెన్షన్స్, ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో దేశ ఆర్థిక భద్రతను కాపాడుకునేందుకు భారతీయులందరూ ఆర్థిక దేశభక్తిని చాటాలని, మనం చేసే ప్రతి చిన్న పొదుపు, దేశాన్ని ప్రపంచ ఆర్థిక సమస్యల నుంచి కాపాడుతుందని ఆయన పేర్కొన్నారు.

Gold Traders Tension | వ్యాపార వర్గాల తమ ఆందోళనలు

ఈ పిలుపు బంగారం వ్యాపారులను (Gold Traders) ఆందోళనకు గురిచేస్తోంది. ప్రధాని వ్యాఖ్యల ప్రభావం బంగారం విక్రయాలపై పడే అవకాశం ఉందని భావిస్తున్న వ్యాపార వర్గాలు.. తమ ఆందోళనలు, పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పీఎంవో దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు పీఎంవో అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం. జువెలరీ రంగంపై ఆర్థిక ప్రభావం, వినియోగదారుల కొనుగోలు ధోరణుల్లో వచ్చే మార్పులపై ఈ భేటీలో చర్చించనున్నారు. బంగారం వ్యాపారానికి ఊతమిచ్చే విధానాలు, పరిశ్రమకు అవసరమైన మద్దతు చర్యలపైనా అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వానికి సూచనలిచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

Gold Traders Tension | చర్చనీయాంశంగా ప్రధాని వ్యాఖ్యలు..

మన దేశం క్రూడ్ ఆయిల్ (Crude Oil), బంగారం, వంట నూనెలు, ఎరువుల కోసం విదేశాలపై ఆధారపడుతోంది. జియో పొలిటికల్ టెన్షన్స్‌తో అన్నింటి ధరలూ పెరుగుతున్నాయి. దీంతో రూపాయి విలువ బలహీనపడుతోంది. ద్రవ్యలోటు పెరుగుతుండడంతో మన ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు ప్రధాని పలు కీలక సూచనలు చేశారు. ఏడాది పాటు బంగారం కొనవద్దని, వ్యక్తిగత వాహనాలను కాకుండా ప్రజా రవాణా సౌకర్యాలను ఎక్కువగా వినియోగించాలని, స్వదేశీ ఉత్పత్తులను ఎక్కువగా వినియోగించాలని ప్రజలను కోరారు. ప్రస్తుత ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని విజ్ఞప్తులు చర్చనీయాంశంగా మారాయి.

ఇది కూడా చదవండి..: Gold Purchase Ban | ఏడాదిపాటు బంగారం కొనొద్దు.. మోదీ రిక్వెస్ట్ వెనక వ్యూహమేంటీ?

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *