తెలంగాణACB Raids | తహశీల్దార్​ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

ACB Raids | తహశీల్దార్​ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్​ తహశీల్దార్​ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | రంగారెడ్డి (Rangareddy) జిల్లా శంషాబాద్​ తహశీల్దార్​ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. రెండు రోజుల్లోనే ఆఫీసుల్లో రెండు సార్లు ఏసీబీ సోదాలు జరగడం తీవ్ర చర్చకు దారి తీసింది.

రాష్ట్రంలోని పలు తహశీల్దార్​ కార్యాలయాల్లో అవినీతి జోరుగా సాగుతోంది. ఈ మేరకు ఏసీబీకి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. శంషాబాద్​ తహశీల్దార్ కార్యాలయంపై సైతం ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు, బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ నేతృత్వంలో సోదాలు చేపట్టారు.

ACB Raids | గేట్లు మూసివేసి..

ఏసీబీ (ACB) అధికారులు సోమవారం ఉదయం కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం సిబ్బంది బయటకు వెళ్లకుండా గేట్లు మూసి వేసి తనిఖీలు చేపట్టారు. చాలా సేపు సోదాలు చేపట్టడంతో సిబ్బంది ఆందోళన చెందారు. అయితే రెండు రోజుల క్రితం కార్యాలయంలో చేపట్టిన తనిఖీల్లో అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉండటం, అలాగే రెవెన్యూ విభాగంలో అవినీతిపై స్పష్టమైన ఆధారాలు లభించడంతో మళ్లీ సోదాలు చేశారు. భూమి రికార్డుల మార్పిడి, రిజిస్ట్రేషన్ అంశాల్లో కొందరు అధికారులు భారీగా ముడుపులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది.

దీనిని కూడా చదవండి : Bandi Bhagirath POCSO Case | బండి భగీరథ్​ కేసులో విచారణ ప్రారంభం : సీఎం రేవంత్​రెడ్డి

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bandi Bhagirath Case | పరారీలో బండి సంజయ్​ కుమారుడు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Bhagirath Case | కేంద్ర మంత్రి...

Annasagar Theft Case | అన్నాసాగర్‌లో దొంగల బీభత్సం.. తొమ్మిది ఇళ్లలో చోరీలు

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Annasagar Theft Case | మండలంలోని (Yellareddy) అన్నాసాగర్...

Health Department Transfers | పారదర్శకంగా ఉద్యోగుల బదిలీలు : మంత్రి రాజనర్సింహ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Health Department Transfers | ప్రభుత్వం ఇచ్చిన...

POLYCET Exam | పాలిసెట్ పరీక్షకు సర్వం సిద్ధం..‘నిమిషం’ నిబంధన అమలు

అక్షరటుడే, కామారెడ్డి: POLYCET Exam | పట్టణంలో ఈనెల 13న నిర్వహించనున్న...