తెలంగాణHealth Department Transfers | పారదర్శకంగా ఉద్యోగుల బదిలీలు : మంత్రి రాజనర్సింహ

Health Department Transfers | పారదర్శకంగా ఉద్యోగుల బదిలీలు : మంత్రి రాజనర్సింహ

ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం పారదర్శకంగా బదిలీల ప్రక్రియ చేపడుతామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Health Department Transfers | ప్రభుత్వం ఇచ్చిన జీవో 38 ప్రకారం పారదర్శకంగా బదిలీల ప్రక్రియ చేపడుతామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Rajanarasimha) స్పష్టం చేశారు. ఈ మేరకు గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్‌ ప్రతినిధులతో మంత్రి సోమవారం సమావేశం నిర్వహించారు. సెక్రటేరియట్‌లోని మంత్రి చాంబర్‌‌లో జరిగిన సమావేశంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, జాయింట్ సెక్రటరీ అయేషా, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, డాక్టర్ సంగీత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

గతంలో జనరల్ ట్రాన్స్‌ఫర్లు పారదర్శకంగా జరిగాయని, ఈసారి కూడా అదే విధంగా ట్రాన్స్‌ఫర్లు ఆఫ్లైన్‌లో చేయాలని డాక్టర్లు కోరారు. టీజీడీఏ (TGDA) ఆఫీస్ బేరర్లకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని, 2 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నవారికి కూడా బదిలీల్లో అవకాశం ఇవ్వాలని, జిల్లాల్లోని మెడికల్ కాలేజీల్లో (Medical Colleges) పనిచేస్తున్న వారికి హైదరాబాద్‌ (Hyderabad)లోని కాలేజీల్లోకి వచ్చేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి మాట్లాడుతూ.. పారదర్శకంగా ట్రాన్స్‌ఫర్లు చేపడుతామని స్పష్టం చేశారు.

Health Department Transfers | వారికి అవకాశం ఇస్తాం

రాష్ట్రంలో వైద్య విద్యను బలోపేతం చేయడంతో పాటు, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇందుకు డాక్టర్ల సహకారం అవసరం అన్నారు. కాలేజీలు, హాస్పిటళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని జీవో ప్రకారం ట్రాన్స్‌ఫర్లు ఉంటాయని స్పష్టం చేశారు. అడ్మినిస్ట్రేషన్, టీచింగ్, క్లినికల్ వర్క్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాల్లోని కాలేజీలు, హాస్పిటళ్లలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నవారికి బదిలీల్లో అవకాశం కల్పిస్తామని తెలిపారు.

దీనిని కూడా చదవండి : ACB Raids | తహశీల్దార్​ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Kamareddy House Survey | కామారెడ్డి జిల్లాలో ఇంటింటి సర్వే ప్రారంభం

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Kamareddy House Survey | జాతీయ జనగణనలో(Census) కీలకమైన...

Bandi Bhagirath Case | పరారీలో బండి సంజయ్​ కుమారుడు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Bhagirath Case | కేంద్ర మంత్రి...

Annasagar Theft Case | అన్నాసాగర్‌లో దొంగల బీభత్సం.. తొమ్మిది ఇళ్లలో చోరీలు

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Annasagar Theft Case | మండలంలోని (Yellareddy) అన్నాసాగర్...