క్రీడలుDelhi Capitals Playoff Chances | 211 పరుగుల ఛేదనలో ఢిల్లీ సంచలన విజ‌యం.. ప్లే...

Delhi Capitals Playoff Chances | 211 పరుగుల ఛేదనలో ఢిల్లీ సంచలన విజ‌యం.. ప్లే ఆఫ్స్ చేరుకునే అవ‌కాశం ఉందా?

పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉత్కంఠభరితంగా ఛేదించిన ఢిల్లీ, కీలక సమయంలో కెప్టెన్ అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్ మెరుపులతో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi Capitals Playoff Chances | ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (Indian Premier League 2026) సీజన్‌లో మరో హై వోల్టేజ్ మ్యాచ్ అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించింది.

ధర్మశాలలోని హిమాచ‌ల్ ప్ర‌దేశ్ క్రికెట్ అసోసియేష‌న్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ (Delhi Capitals) అద్భుత పోరాటంతో పంజాబ్ కింగ్స్‌ పై మూడు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. కేవలం 14 పరుగులకే ఓపెనర్లు అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్‌ ఔటవడంతో జట్టు కష్టాల్లో పడింది. ఆ తర్వాత సాహిల్ పరాఖ్ కొన్ని బౌండరీలతో మెరిపించినా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. దీంతో 5 ఓవర్లకే ఢిల్లీ 38/3తో ఒత్తిడిలోకి వెళ్లింది.

Delhi Capitals Playoff Chances | అన్ని గెలవాల్సిన ప‌రిస్థితి..

ఈ పరిస్థితిలో కెప్టెన్ అక్ష‌ర్ (Axar Patel) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. ట్రిస్టన్ స్టబ్స్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసిన అక్షర్, ఆ తర్వాత డేవిడ్ మిల్ల‌ర్‌ (David Miller)తో కలిసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఇద్దరూ పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.ప్రత్యేకంగా అక్షర్ పటేల్ కేవలం 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు మిల్లర్ తన స్టైల్‌లో భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.

వీరిద్దరి భాగస్వామ్యంతో ఢిల్లీ మళ్లీ విజయ రేసులోకి వచ్చింది. అయితే కీలక సమయంలో ఇద్దరూ ఔటవడంతో మ్యాచ్ మళ్లీ ఉత్కంఠగా మారింది.అలాంటి సమయంలో ఐపీఎల్ అరంగేట్రం చేసిన యువ ఆటగాడు మాధవ్ తివారీ అసాధారణ ధైర్యం ప్రదర్శించాడు. ఒత్తిడిని ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం 8 బంతుల్లో 18 పరుగులు చేసి మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పాడు. చివరి రెండు ఓవర్లలో 17 పరుగులు అవసరమైన దశలో ఆఖిబ్ నబీ కొట్టిన భారీ సిక్సర్ ఢిల్లీ విజయాన్ని ఖాయం చేసింది. మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ లక్ష్యాన్ని ఛేదించి ప్లేఆఫ్ ఆశలను బతికించింది.

Delhi Capitals Playoff Chances | పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి

ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 210 పరుగుల భారీ స్కోరు చేసింది. యువ బ్యాటర్ ప్రియాంశ్ ఆర్య అద్భుత హాఫ్ సెంచరీ చేయగా, కెప్టెన్ శ్రేయాస్ అయ్య‌ర్ (Shreyas Iyer) 59 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయినప్పటికీ బౌలర్లు, ఫీల్డర్లు కీలక సమయంలో విఫలం కావడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు.మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్ జట్టు ప్రదర్శనపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. “ఫీల్డింగ్, బౌలింగ్‌లో చేసిన తప్పులే మా ఓటమికి కారణం.

పిచ్ బౌలర్లకు సహకరించినా మేం సరైన ప్రణాళికలను అమలు చేయలేకపోయాం” అని పేర్కొన్నాడు. ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ వరుసగా నాలుగో పరాజయాన్ని చవిచూసింది. ఒక దశలో టాప్‌లో ఉన్న జట్టు ఇప్పుడు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోవడం గమనార్హం.ఇక ఇదిలా ఉంటే ఢిల్లీ మిగిలిన 3 మ్యాచ్‌ల్లోనూ గెలిస్తేనే వీరికి అవకాశం ఉంటుంది. ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటికే.

ఇది కూడా చదవండి..: Tim David Controversy | భువీ సిక్సర్ తర్వాత టిమ్ డేవిడ్ వివాదాస్పద సెలబ్రేషన్.. బ్యాన్ విధిస్తారా..!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

TVK MLA Shock | ఒక్క ఓటు తేడాతో గెలిచిన ఎమ్మెల్యేకు కోర్టు షాక్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TVK MLA Shock | తమిళనాడు ఎన్నికల్లో...

Maoist Leader Surrenders | మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి దంపతుల లొంగుబాటు!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Maoist Leader Surrenders | మావోయిస్టు పార్టీలో అత్యంత...

Stock Market Crash | భారీ నష్టాల్లో సూచీలు..

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Crash | కొనసాగుతున్న అమెరికా -ఇరాన్...

Miyapur Girl Death | నీటి సంపులో పడి బాలిక మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్: Miyapur Girl Death | నీటి సంపులో పడి...