హైదరాబాద్Street Dog Attack | హైదరాబాద్​లో దారుణం.. బాలుడిపై 10 వీధికుక్కల దాడి

Street Dog Attack | హైదరాబాద్​లో దారుణం.. బాలుడిపై 10 వీధికుక్కల దాడి

హైదరాబాద్​లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆడుకుంటున్న బాలుడిపై 10 వీధి కుక్కలు దాడి చేశాయి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Street Dog Attack | హైదరాబాద్​ (Hyderabad)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆడుకుంటున్న బాలుడిపై 10 వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.మీర్​పేట్​లోని టీచర్స్​ కాలనీలో వీధికుక్కలు బీభత్సం సృష్టించాయి.

ఇంటి సెల్లార్ పరిధిలో ఆడుకుంటున్న చిన్నారి అద్విక్​పై దాడి చేశాయి. ఒకేసారి పది కుక్కలు బాలుడిపై విచక్షణరహితంగా దాడి చేశాయి. సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Street Dog Attack | వేసవి సెలవులకు వచ్చి..

సిద్దిపేటకు చెందిన అద్విక్.. వేసవి సెలవులు కావడంతో తన పిన్ని వాళ్ల ఇంటికి వచ్చినట్లు తెలిసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పలువురు మాజీ కార్పొరేటర్లు (Former Corporators) బాలుడిని పరామర్శించారు. బాలుడికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. భవిష్యత్​లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

Street Dog Attack | కుక్కల స్వైరవిహారం

రాష్ట్రవ్యాప్తంగా వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. చిన్నా పెద్ద లేకుండా అందరిపై దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులు ఒంటరిగా కనిపిస్తే కరుస్తున్నాయి. రాత్రిపూట బైక్​పై వెళ్తున్న వారిని వెంబడిస్తున్నాయి. దీంతో వారు ప్రమాదాలకు గురి అవుతున్నారు. వీధికుక్కల బెడద నివారణకు ప్రభుత్వం, అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇది కూడా చదవండి..: MMTS Train Cancel | పలు ఎంఎంటీఎస్​ రైళ్ల రద్దు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Kamareddy Highway Busstand | కామారెడ్డిలో హైవే బస్టాండ్ ఏర్పాటు చేయాలి..

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Highway Busstand | జిల్లా కేంద్రమైన కామారెడ్డి...

JCD Prabhakar Politics|తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా జేసీడీ ప్రభాకర్ ఏకగ్రీవ ఎన్నిక

అక్షరటుడే వెబ్‌డెస్క్:JCD Prabhakar Politics|నటుడిగా ప్రజాదరణ పొంది, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన...

Hyundai New SUV | హ్యుందాయ్ నుంచి కొత్త కారు.. వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyundai New SUV | ఆటోమొబైల్ రంగ దిగ్గజ...

Cow Slaughter Ban | గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి: వీహెచ్‌పీ డిమాండ్

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Cow Slaughter Ban | గోవధ చట్టాన్ని పక్కాగా...