NEET UG Cancelled | నీట్​ పరీక్ష రద్దు.. సంచలన నిర్ణయం తీసుకున్న ఎన్టీఏ

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: NEET UG Cancelled | నీట్​ యూజీ 2026 పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్​ ఏజెన్సీ ప్రకటించింది. మే 3న జరిగిన పరీక్షను కేంద్ర ప్రభుత్వ (Central Government) ఆమోదంతో రద్దు చేయాలని నిర్ణయించామని పేర్కొంది. ఈ పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని, త్వరలో తేదీలను ప్రకటిస్తామని తెలిపింది.

రాజస్థాన్ (Rajasthan)లో పేపర్ లీక్ ఆరోపణలతో పరీక్షను ఎన్టీఏ రద్దు చేసింది. త్వరలో పరీక్షల తేదీలు ప్రకటిస్తామని వెల్లడించింది. ఎంబీబీఎస్​ ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా మే 3న నీట్​ పరీక్ష (NEET Exam) నిర్వహించారు. అయితే రాజస్థాన్​లో పేపర్​ లీక్​ అయిందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో పరీక్షను ఎన్టీఏ రద్దు చేసింది. మరోవైపు పేపర్​ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణ (CBI Inquiry)కు ఆదేశించింది.

NEET UG Cancelled | అసలు ఏం జరిగిందంటే..

మే 3న దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష నిర్వహించగా, మే 2 రాత్రే కొందరు విద్యార్థులకు ఒక ‘గెస్ పేపర్’ సర్క్యులేట్ అయినట్లు సమాచారం. పరీక్ష పూర్తయ్యాక ఆ గెస్ పేపర్‌లోని ప్రశ్నలను అసలు ప్రశ్నపత్రంతో పోల్చి చూడగా, బయాలజీ, కెమిస్ట్రీ విభాగాల్లో 100కు పైగా ప్రశ్నలు దాదాపు పూర్తిగా సరిపోలినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. దీంతో ప్రశ్నాపత్రం లీక్ జరిగిందన్న అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ ఘటనపై కొందరు విద్యార్థులు సికార్‌లోని ఉద్యోగ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అనంతరం రాజస్థాన్ డీజీపీ ఆదేశాల మేరకు రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, యాంటీ టెర్ర‌రిజం స్వ్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రశ్నపత్రం ఎలా లీక్ అయింది, దీనికి వెనుక ఉన్న నెట్వర్క్ ఎవరు అనే కోణాల్లో అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్​టీఏ తెలిపింది.

NEET UG Cancelled | పారదర్శకత కోసం..

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకారం, చట్ట అమలు సంస్థలు పంచుకున్న సమాచారాన్ని సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత పరీక్షను కొనసాగించడం సాధ్యం కాదని ఎన్​టీఏ అధికారిక ప్రకటనలో పేర్కొంది. జాతీయ పరీక్షా వ్యవస్థలో పారదర్శకత, విశ్వసనీయతను కాపాడటానికి పరీక్షను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు ‘గెస్ పేపర్’ లీక్‌పై 45 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణకు సీబీఐకి సహకరిస్తామని ఎన్​టీఏ తెలిపింది.

ఇది కూడా చదవండి..: Inter Admissions | య‌థావిధిగా ఇంట‌ర్ అడ్మిష‌న్లు.. సీఎం కీలక ఆదేశాలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *