నిజామాబాద్Cow Slaughter Ban | గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి: వీహెచ్‌పీ డిమాండ్

Cow Slaughter Ban | గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి: వీహెచ్‌పీ డిమాండ్

గోవధ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని వీహెచ్​పీ, బజరంగ్​దల్ కార్యకర్తలు డిమాండ్​ చేశారు. ఈ మేరకు ఎల్లారెడ్డి పట్టణంలో మంగళవారం గోవధ చట్టాలకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Cow Slaughter Ban | గోవధ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని వీహెచ్​పీ (VHP Yellareddy), బజరంగ్​దల్(Bajrang Dal) కార్యకర్తలు డిమాండ్​ చేశారు. ఈ మేరకు ఎల్లారెడ్డి(Yellareddy) పట్టణంలో మంగళవారం గోవధ చట్టాలకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.

Cow Slaughter Ban | 1977లో గోవధ నిషేధ చట్టం..

ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1977లో తీసుకొచ్చిన గోవధ నిషేధ చట్టాన్ని(Cow Slaughter Prohibition Act) కఠినంగా అమలు చేయాలని డిమాండ్​ చేశారు. ఆక్రమణల్లో ఉన్న ఆలయ భూములకు వెంటనే విముక్తి కల్పించాలన్నారు. ప్రతి జిల్లాలో కనీసం 10 ఎకరాల స్థలంలో ప్రభుత్వమే గోశాలలను ఏర్పాటు చేయాలని, చట్టవిరుద్ధంగా నడుస్తున్న గోవధశాలలను తక్షణమే మూసివేయించాలని కోరారు.

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో(Telangana Assembly) తీర్మానం చేయాలని, గో ఆధారిత వ్యవసాయదారులకు సబ్సిడీలు ఇవ్వాలని వీహెచ్‌పీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ కామారెడ్డి జిల్లా గోరక్ష ప్రముఖ్ తులసీదాస్, త్రీ ప్రఖండ సంఘటన మంత్రి వినోద్ కుమార్, విశ్వహిందూ పరిషత్ ఎల్లారెడ్డి మండల అధ్యక్షుడు నవీన్, హరిబాబు, రాహుల్, హర్ష, పురుషోత్తం, యాదగిరి, విద్యాసాగర్, రాజ్ కుమార్, నవీన్​తో పాటు పలువురు హిందూ బంధువులు, చిన్నలు, పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: India Toy Industry | ప్రపంచానికి ‘బొమ్మ’ చూపిస్తున్న భారత్.. ఆత్మనిర్భరత దిశగా ముందడుగు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Feel The Jail| చంచల్‌గూడలో ‘ఫీల్ ది జైల్’ షురూ.. ప్రారంభించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా

అక్షరటుడే వెబ్‌డెస్క్:Feel The Jail| సాధారణ పౌరులకు జైలు జీవితం ఎలా...

Mouni Roy Divorce | మౌనీ రాయ్ దాంపత్య జీవితంలో విభేదాలా.. విడాకుల ప్రచారంలో నిజమెంత‌?

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mouni Roy Divorce | ప్రముఖ బాలీవుడ్ నటి...

Bandi Bhagirath Bail | కోర్టును ఆశ్రయించిన బండి సంజయ్​ కుమారుడు

అక్షరటుడే వెబ్‌డెస్క్:Bandi Bhagirath Bail | కేంద్ర సహాయ మంత్రి బండి...

Illegal Sand Transport | అక్రమ ఇసుక రవాణాపై చీతా ఫోర్స్​ ఉక్కుపాదం.. రెండు భారీ లారీలు సీజ్

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Illegal Sand Transport | నిజామాబాద్ పోలీస్...