జాతీయంFeel The Jail| చంచల్‌గూడలో 'ఫీల్ ది జైల్' షురూ.. ప్రారంభించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా

Feel The Jail| చంచల్‌గూడలో ‘ఫీల్ ది జైల్’ షురూ.. ప్రారంభించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా

సాధారణ పౌరులకు జైలు జీవితం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా రుచి చూపించేందుకు తెలంగాణ జైళ్ల శాఖ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

అక్షరటుడే వెబ్‌డెస్క్:Feel The Jail| సాధారణ పౌరులకు జైలు జీవితం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపించేందుకు తెలంగాణ జైళ్ల శాఖ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ఫీల్ ది జైల్’ (Feel the Jail) పేరుతో చంచల్‌గూడ సెంట్రల్ జైలు పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక సదుపాయాన్ని, జైలు మ్యూజియంను గవర్నర్ శివప్రతాప్ శుక్లా అధికారికంగా ప్రారంభించారు.

Feel The Jail | ఖైదీలా ఒక రోజు..

ఈ కార్యక్రమంలో భాగంగా కేవలం రూ. 500 చెల్లిస్తే 24 గంటల పాటు ఖైదీలా జైలులో గడిపే అవకాశం కల్పిస్తున్నారు. ఇది కేవలం సందర్శన మాత్రమే కాదు, ఒక ఖైదీ అనుభవించే జీవనశైలిని పూర్తిస్థాయిలో అనుభవించాల్సి ఉంటుంది. ఖైదీలకు ఇచ్చే విధంగానే యూనిఫాం, స్టీలు పళ్లెం, గ్లాసు, మగ్గు , సబ్బు వంటి ప్రాథమిక వస్తువులను అందిస్తారు. జైలు మెనూ ప్రకారం ఖైదీలకు వడ్డించే ఆహారాన్నే వీరికి కూడా వడ్డిస్తారు. ఉదయం నిద్రలేవగానే జైలు గంట కొట్టిన దగ్గర నుండి, రాత్రి లాకప్ వరకు ఖైదీలు పాటించే కఠిన నియమ నిబంధనలను వీరు కూడా పాటించాల్సి ఉంటుంది.

Feel The Jail | మధ్యలో బయటకు రావాలంటే..

జైలు వాతావరణాన్ని తట్టుకోలేక 24 గంటల గడువు ముగియకముందే బయటకు రావాలనుకుంటే రూ. 1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ (DG Prisons) సౌమ్య మిశ్రా (IPS) , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జైలు మ్యూజియం ద్వారా జైళ్ల చరిత్రను వివరించడంతో పాటు, ప్రజలకు చట్టం పట్ల గౌరవం పెంచడం , క్రైమ్ రేటును తగ్గించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం అని అధికారులు తెలిపారు.

 

ఇది కూడా చదవండి: NEET UG Cancelled | నీట్​ పరీక్ష రద్దు.. సంచలన నిర్ణయం తీసుకున్న ఎన్టీఏ

 

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ONGC Share Price | రాయల్టీ రేట్ తగ్గించిన కేంద్రం.. పరుగులు తీసిన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా షేర్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ONGC Share Price |భారతదేశంలో అప్‌స్ట్రీమ్ అన్వేషణ,...

Kamareddy Railway Court | కవితకు షాక్​ ఇచ్చిన రైల్వే కోర్టు.. విచారణకు రావాలని ఆదేశం..

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Railway Court | బీసీలకు 42 శాతం...

Ricky Radhan OSD| ముఖ్యమంత్రి పక్కన జ్యోతిష్యుడు.. విజయ్ నిర్ణయంపై వెల్లువెత్తుతున్న విమర్శలు

అక్షరటుడే వెబ్‌‌డెస్క్:Ricky Radhan OSD| తమిళనాడు రాజకీయాల్లో మార్పు తెస్తారని, కొత్త...