Liquor Scam | మద్యం షాపుల్లో బినామీల రాజ్యం.. ఎస్సీ కోటాపై ఐటీ శాఖ పంజా

Shivam nagarani

అక్షరటుడు వెబ్‌డెస్క్:  Liquor Scam | తెలంగాణ రాష్ట్రంలోని మద్యం దుకాణాల కేటాయింపుల్లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. ఎస్సీ (SC) సామాజిక వర్గానికి కేటాయించిన లిక్కర్ షాపులను బినామీలు నడిపిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ (IT) గుర్తించింది. చందానగర్‌లో ఒక షాపును సీజ్ చేయడంతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Liquor Scam | ఎస్సీ కోటాలో సిండికేట్ల రాజ్యం..

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకు ఆర్థిక చేయూతనిచ్చే లక్ష్యంతో కొన్ని మద్యం దుకాణాలను రిజర్వ్ చేసింది. అయితే, ఈ షాపులను సిండికేట్ వ్యక్తులు, రాజకీయ పలుకుబడి ఉన్న థర్డ్ పార్టీ వ్యక్తులే వెనకుండి నడిపిస్తున్నట్లు ఐటీ శాఖ ఆధారాలు సేకరించింది. కేవలం రికార్డుల్లో మాత్రమే ఎస్సీ వ్యక్తుల పేర్లు ఉన్నాయని, అసలు పెట్టుబడి , లాభాలు మొత్తం సిండికేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయని అధికారులు నిర్ధారించారు.

Liquor Scam | చందానగర్‌లో ఒక వైన్ షాపు సీజ్..

బినామీ నిరోధక చట్టం (Prohibition of Benami Property Transactions Act) కింద ఐటీ అధికారులు తొలిసారిగా చందానగర్‌లోని ఒక వైన్ షాపును సీజ్ చేశారు. ఈ షాపు యజమానిగా ఒక ఎస్సీ వ్యక్తి ఉన్నప్పటికీ, దాని అసలు కార్యకలాపాలు మరొకరి చేతుల్లో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.

Liquor Scam | మల్కాజ్‌గిరి నుంచి యాదాద్రి వరకు ..

చందానగర్ మద్యం దుకాణం సీజ్ వ్యవహారం కేవలం ఒక ఆరంభం మాత్రమేనని, రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ కోటా షాపుల్లో ఇలాంటి అక్రమాలు భారీగా జరిగినట్లు ఆదాయపు పన్ను శాఖ (IT) గుర్తించింది. ముఖ్యంగా మల్కాజ్‌గిరి ప్రాంతంలోని ఎస్సీ రిజర్వుడ్ షాపులపై బినామీ నిఘాను తీవ్రం చేయగా, సరూర్ నగర్ పరిధిలో పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు జరిగినట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. అలాగే యాదాద్రి జిల్లాలోని పలు మద్యం దుకాణాల్లో సిండికేట్ వ్యక్తులు తెరవెనుక ఉండి చక్రం తిప్పుతున్నట్లు సమాచారం తీసుకున్నారు.

Liquor Scam | బినామీ చట్టం కింద కఠిన చర్యలు..

ఎస్సీల పేరుతో మద్యం దుకాణాలు దక్కించుకుని, వారిని నామమాత్రపు యజమానులుగా ఉంచి కోట్లాది రూపాయలు గడిస్తున్న బినామీ నెట్‌వర్క్‌పై ఐటీ శాఖ ఉచ్చు బిగిస్తోంది. ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న థర్డ్ పార్టీ వ్యక్తులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే మరికొన్ని జిల్లాల్లోని వైన్ షాపులపై సోదాలు జరిగే అవకాశం ఉంది.

 

 

ఇది కూడా చదవండి:  Bandi Bhagirath Bail | కోర్టును ఆశ్రయించిన బండి సంజయ్​ కుమారుడు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *