నిజామాబాద్Census India | ’మీరే ఓ ఎన్యుమరేటర్’.. స్వీయ జనగణనకు ప్రభుత్వం శ్రీకారం..

Census India | ’మీరే ఓ ఎన్యుమరేటర్’.. స్వీయ జనగణనకు ప్రభుత్వం శ్రీకారం..

జనగణనలో భాగంగా వివరాలను సొంతగా నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరాల్లో ప్రారంభమైన స్వీయ జనగణన ప్రక్రియపై అధికారులు విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రతి ఇంటికీ అవగాహన కల్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Census India | జనగణనలో భాగంగా వివరాలను సొంతగా నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. నగరాల్లో ప్రారంభమైన స్వీయ జనగణన (Census) ప్రక్రియపై అధికారులు విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రతి ఇంటికీ అవగాహన కల్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

Census India | ప్రజలే స్వచ్ఛందంగా పోర్టల్​లో..

జనగణన ప్రక్రియ ఆరంభమైంది. ప్రజలే స్వచ్ఛందంగా పోర్టల్‌లో స్వీయ గణన చేసుకునే వెసులుబాటును ప్రభుత్వాలు కల్పించాయి. గతంలో ఎన్యుమరేటర్లు (Enumerators) ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరించేవారు. ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్, ల్యాప్‌టాప్ ద్వారా స్వయంగా ఎవరికి వారే వివరాలు నమోదు చేసుకునే ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం నిర్వహించే జనాభా గణన లేదా ఇతర సర్వేల్లో ప్రజలు ఎన్యుమరేటర్లుగా కీలక పాత్ర పోషించేవారు. కానీ, జనగణనలో ఎన్యుమరేటర్ల సాయం లేకుండానే అధికారిక పోర్టల్ ద్వారా తమ కుటుంబ సభ్యులు, ఇతర వివరాలు నమోదు చేసుకునేందుకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ తీసుకొచ్చారు. దీంతో సమాచార గోప్యతతోపాటు సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు.

Census India | లాగిన్ అవ్వడం ఇలా..

ముందుగా ‘es.censusindia.gov.in’ అనే అధికారిక పోర్టల్‌ను సందర్శించాలి. అక్కడ లాగిన్ ప్రక్రియలో రాష్ట్రం, క్యాప్చా నమోదు చేసి వెరిఫై చేయాలి. అనంతరం యూజర్ నేమ్, ఫోన్ నంబర్​, ఈ-మెయిల్ ఐడీ నమోదు చేస్తే ఫోన్‌కు ఆరు అంకెల ఓటీపీ వస్తుంది. దీనిని నమోదు చేసిన అనంతరం ప్రక్రియ ప్రారంభమవుతుంది. శాటిలైట్ మ్యాప్ (Satellite Map) కనిపిస్తూనే చిరునామా, పిన్‌కోడ్ నమోదు చేయమని అడుగుతుంది. మీరిచ్చే సమాచారం ఆధారంగా ఆక్యుపెన్సీ, రేఖాంశాల వివరాలు తీసుకుని మీ ఇంటిని మ్యాప్‌లో నమోదు చేస్తుంది.

Census India | ప్రశ్నావళికి సమాధానాలివ్వండి..

మీ ఇల్లు మట్టితో కట్టిందా..? సిమెంట్ ఇటుకలతోనా..? గోడల పరిస్థితి ఏంటి..? ఇల్లు ప్రస్తుతం ఏ స్థితిలో ఉంది? తాగునీటి సౌకర్యం, టాయిలెట్ ఫెసిలిటీ, వంటకు వాడే ఇంధనం ఇలా సుమారు 30 ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేయాలి. కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సు, లింగం, విద్యార్హతలు, వృత్తి, వైవాహిక స్థితి ఇలా అన్నీ నమోదు చేశాక సేవ్ చేసుకుంటూ వెళ్లాలి. చివరకు ప్రివ్యూ చూసుకొని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశాక ఓ రిఫరెన్స్ నంబర్ వస్తుంది. దాన్ని మనం భద్రంగా దాచుకోవాలి. తర్వాత ఎన్యుమరేటర్ మన ఇంటికి వచ్చినప్పుడు ఆ నంబర్ ఇస్తే చాలు. మళ్లీ మన వివరాలను వారికి చెప్పాల్సిన అవసరం ఉండదు.

ముఖ్యమైన తేదీలు.. సూచనలు..

ఈనెల 16 నుంచి 30 వరకు మాత్రమే స్వీయ లెక్కింపునకు అవకాశం ఉంది. 30 తర్వాత ఎన్యుమరేటర్లే ఇంటికి వస్తారు. పోర్టల్‌లో తెలుగు సహా అన్ని ప్రాంతీయ భాషల్లో వివరాలు నమోదు చేసుకునే సౌకర్యం ఉంది. ఏమైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800-345-6789కి కాల్ చేయవచ్చు. లేదా స్థానిక మున్సిపల్/గ్రామపంచాయతీ కార్యాలయంలో (Village Panchayat) సంప్రదించాలి. మీరు ఇచ్చే సమాచారం ఆధారంగానే ప్రభుత్వ పథకాలు, రేషన్ కార్డులు, ఇళ్ల కేటాయింపు, బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. తప్పుడు సమాచారం ఇవ్వడం చట్టరీత్యా నేరం.

విస్తృతంగా అవగాహన కల్పించాలి..

కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రతి వార్డులో ప్రత్యేక క్యాంప్​లు పెట్టి అవగాహన కల్పించాలని అధికారులు పేర్కొన్నారు. ప్రజలంతా ఈ ప్రక్రియలో భాగస్వాములై స్వీయగణన చేసుకునే వెసులుబాటును వినియోగించుకోవాలని, దేశాభివృద్ధికి తోడ్పడాలని అధికారులు కోరుతున్నారు. మీ ఫోన్‌లో ‘Census India 2027 Self Enumeration’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని కూడా వివరాలు నింపవచ్చు.

నిజామాబాద్​, కామారెడ్డిలో..

ఉమ్మడిజిల్లాలో.. ఏప్రిల్ 26, 2026న ప్రారంభమై మే 10వ తేదీ వరకు జనగణన జరుగనుంది. మొత్తం 15 రోజులు మాత్రమే ఈ కార్యక్రమం ఉంది. es.censusindia.gov.in పోర్టల్ లేదా ‘Census India 2027 Self Enumeration’ యాప్ ద్వారా మీరే స్వయంగా వివరాలు నమోదు చేసుకోవచ్చు. మే 10 తర్వాత సెల్ఫ్ ఎన్యుమరేషన్ విండో క్లోజ్ అవుతుంది. అప్పటికి నమోదు చేసుకోకపోతే ఎన్యుమరేటర్లు ఇంటింటికి వచ్చి వివరాలు సేకరిస్తారు. నిజామాబాద్ (Nizamabad), కామారెడ్డి (Kamareddy) జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతి మండలం, గ్రామపంచాయతీలో ప్రత్యేక క్యాంప్​లు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తారు. జిల్లాస్థాయి నోడల్ అధికారి – అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఉంటారు. ఏప్రిల్ 26 నుంచి పోర్టల్ ఓపెన్ అవుతుంది. మీరు అప్పుడే చేసుకుంటే ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చే అవసరం ఉండదు. రిఫరెన్స్ నంబర్ భద్రంగా దాచుకుంటే చాలు.

censuss

ఇది కూడా చదవండి: Sadabainama regularization | సాదాబైనామాలకు మోక్షం.. క్రమబద్ధీకరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Iran New Weapon | అమెరికా భయపడే ఆయుధం సిద్ధం : ఇరాన్​

అక్షరటుడే, వెబ్​డెస్క్: Iran New Weapon | అమెరికా- ఇరాన్‌ మధ్య...

DJ Sound | డీజే శబ్దం భరించలేక 140 కోళ్లు మృతి.. ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన

అక్షరటుడే, వెబ్​డెస్క్: DJ Sound | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని...

Bellamkonda Wedding | రుమలలో ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం.. కావ్య రెడ్డితో కొత్త జీవితానికి శ్రీకారం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bellamkonda Wedding | తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక...

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...