Srivani Tickets Scam | శ్రీవారి టికెట్ల హైజాక్.. సాఫ్ట్‌వేర్ వాడి అక్రమార్కుల దోపిడీ!

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:Srivani Tickets Scam |తిరుమల శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్‌లో భారీ అవకతవకలు జరుగుతున్నట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. టెక్నాలజీని ఉపయోగించి సాధారణ భక్తులకు అందకుండా క్షణాల్లో టికెట్లను మాయం చేస్తున్న ముఠాల ఆటకట్టించారు.

Srivani Tickets Scam | దోపిడీ ఇలా..

శ్రీవాణి ట్రస్టుకు విరాళం ఇచ్చే భక్తుల కోసం టీటీడీ ప్రతిరోజూ ఆన్‌లైన్‌లో 800 టికెట్లను అందుబాటులో ఉంచుతుంది. అయితే, కొన్ని ప్రైవేట్ నెట్ సెంటర్లు , ట్రావెల్ ఏజెంట్లు “ఆటో ఫిల్లింగ్” (Auto-filling) వంటి థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్లను ఉపయోగిస్తున్నట్లు తేలింది. సాధారణ భక్తులు తమ వివరాలు నమోదు చేసేలోపే, ఈ అక్రమ సాఫ్ట్‌వేర్ల ద్వారా ముందే ఫీడ్ చేసిన భక్తుల వివరాలు క్షణాల్లో సర్వర్‌లోకి వెళ్లిపోతున్నాయి. వెబ్‌సైట్ ఓపెన్ అయిన మొదటి కొన్ని సెకన్లలోనే 400 నుంచి 500 టికెట్లను ఈ అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. అధికారికంగా రూ. 10,500 కు లభించే టికెట్‌ను, అక్రమంగా రూ.13,500 వరకు విక్రయిస్తూ ఒక్కో టికెట్‌పై రూ. 3,000 వరకు అదనంగా దోచుకుంటున్నారు.

Srivani Tickets Scam | రంగంలోకి విజిలెన్స్..

చెన్నైకి చెందిన ‘పద్మావతి ట్రావెల్స్’ అనే సంస్థ శ్రీవాణి టికెట్లను అక్రమంగా విక్రయిస్తోందని అందిన ఫిర్యాదుతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంస్థపై కేసు నమోదు చేసిన విజిలెన్స్ అధికారులు, దీని వెనుక ఉన్న మిగతా ముఠాల కోసం అన్వేషణ ముమ్మరం చేశారు. దళారులను నమ్మి మోసపోవద్దని, కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అక్రమ సాఫ్ట్‌వేర్ల వినియోగాన్ని అరికట్టేందుకు వెబ్‌సైట్ భద్రతను మరింత కఠినతరం చేయాలని టీటీడీ యోచిస్తోంది.

 

 

ఇది కూడా చదవండి: LPG Subsidy Rules|గ్యాస్ వినియోగదారులకు షాక్.. వార్షిక ఆదాయం ఇంత దాటితే సబ్సిడీ ఇక రానట్టే!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *