సినిమాiBomma Website | టాలీవుడ్​కు షాక్​.. ఐ బొమ్మ మళ్లీ వచ్చేసింది

iBomma Website | టాలీవుడ్​కు షాక్​.. ఐ బొమ్మ మళ్లీ వచ్చేసింది

కొంతకాలంగా మూతబడిన ఐ బొమ్మ వెబ్​సైట్ మళ్లీ యాక్టివ్ అయింది. వెబ్​సైట్​లో కొత్త చిత్రాలు ప్రత్యక్షం కావడంతో సినీ వర్గాల్లో ఆందోళన నెలకొంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : iBomma Website | కొంతకాలంగా మూతబడిన ఐ బొమ్మ వెబ్​సైట్ మళ్లీ యాక్టివ్ అయింది. వెబ్​సైట్​లో కొత్త చిత్రాలు ప్రత్యక్షం కావడంతో సినీ వర్గాల్లో ఆందోళన నెలకొంది.

ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్​ పోలీసులు (Hyderabad Police) గతంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం అతడితోనే వెబ్​సైట్ మూసివేయించారు. దీంతో సినీ పరిశ్రమ కొంతకాలంగా ఊపిరి పీల్చుకుంటుంది. అయితే మళ్లీ వెబ్​సైట్ ప్రత్యక్షం కావడంతో టాలీవుడ్​లో ఆందోళన నెలకొంది. ఇప్పుడు మళ్లీ దానిని ఎవరు మొదలు పెట్టారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

iBomma Website | బెయిల్​పై ఉన్న రవి

ఐ బొమ్మ వెబ్​సైట్​తో తెలుగు చిత్రపరిశ్రమకు భారీగా నష్టం వాటిల్లింది. సినిమా విడుదలైన వెంటనే వెబ్​సైట్​లో పైరసీ అప్​లోడ్​ చేస్తుండటంతో నిర్మాతలకు నష్టాలు వచ్చాయి. ఈ క్రమంలో ఐ బొమ్మపై అనేక ఫిర్యాదులు నమోదు అయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన హైదరాబాద్​ సీసీఎస్​ పోలీసులు (Hyderabad CCS Police) వెబ్​సైట్​ నిర్వాహకుడు ఇమ్మడి రవిని గతంలో కూకట్​పల్లిలో అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ తర్వాత వెబ్​సైట్ పూర్తిగా బంద్ అయింది. తాజాగా మళ్లీ యాక్టివేట్​ కావడం చిత్ర పరిశ్రమను ఆందోళన గురి చేస్తోంది. కాగా ఈ కేసులో అరెస్టయిన ఇమ్మడి రవి (Immadi Ravi) ప్రస్తుతం బెయిల్​పై ఉన్నాడు. ఈ సమయంలోనే సడెన్‌గా ఐ బొమ్మ వెబ్ సైట్ మళ్లీ ప్రత్యక్షం కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Sirish Reddy Comments | థియేట‌ర్స్ న‌డ‌వ‌క‌పోతే మూసేయండి అన్న నిర్మాత.. ఇప్పుడు ఆయ‌న ఇండ‌స్ట్రీలోనే లేడంటూ కామెంట్

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

CBSE 12th Results| సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

అక్షరటుడే వెబ్‌డెస్క్:CBSE 12th Results|దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న సెంట్రల్...

Jogipet Diesel Theft| జోగిపేటలో చెడ్డి గ్యాంగ్ కలకలం.. బస్సులు, లారీలే లక్ష్యంగా డీజిల్ చోరీ

అక్షరటుడే వెబ్‌డెస్క్:Jogipet Diesel Theft|సంగారెడ్డి జిల్లా జోగిపేటలో అర్ధరాత్రి వేళ దొంగలు...

Gold Price Hike | సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పసిడి..ఒకేరోజు రూ.వేలల్లో పెరుగుదల

అక్షరటుడే, కామారెడ్డి: Gold Price Hike | పసిడి కొనాలనుకునే వారికి...

Kavitha Demands Lookout Notice| బండి భగీరథ్​పై లుకౌట్ నోటీసులు ఇవ్వాల్సిందే: కవిత

అక్షరటుడే వెబం‌డెస్క్: Kavitha Demands Lookout Notice | కేంద్ర మంత్రి...