తెలంగాణBandi Bhagirath Case|బండి భగీరథ్ అరెస్ట్ ఖాయం.. విదేశాలకు వెళ్లినా రప్పిస్తాం: టీపీసీసీ చీఫ్ మహేష్

Bandi Bhagirath Case|బండి భగీరథ్ అరెస్ట్ ఖాయం.. విదేశాలకు వెళ్లినా రప్పిస్తాం: టీపీసీసీ చీఫ్ మహేష్

రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసుపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అక్షరటుడే వెబ్‌డెస్క్:Bandi Bhagirath Case|రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసుపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు.

Bandi Bhagirath Case|ప్రభుత్వం వెనకేసుకొస్తోందన్నది అబద్ధం..

బండి భగీరథ్ అరెస్ట్ కాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డుపడుతోందంటూ వస్తున్న ఆరోపణలను మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. అతడి అరెస్ట్‌ను ఆపడం ఎవరి వల్లా కాదని, ఈ కేసు నుంచి భగీరథ్‌ను తప్పించాల్సిన అవసరం తమకు లేదని తేల్చి చెప్పారు. ఈ కేసు విచారణలో ఎలాంటి జాప్యం జరగడం లేదని, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని వెల్లడించారు.

Bandi Bhagirath Case|విదేశాలకు వెళ్లినా వదిలే ప్రసక్తే లేదు..

ప్రస్తుతం బండి భగీరథ్ పరారీలో ఉన్నట్లు సమాచారం ఉందని టీపీసీసీ చీఫ్ తెలిపారు. ఈ కొద్ది రోజుల్లోనే అతడు విదేశాలకు పారిపోయాడని తాము భావించడం లేదని, ఒకవేళ నిజంగానే ఇతర దేశాలకు వెళ్లిపోయినా.. అక్కడి నుంచి తిరిగి భారత్‌కు రప్పించడం ప్రభుత్వానికి పెద్ద కష్టమేమీ కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Bandi Bhagirath Case|సిట్ దర్యాప్తు ముమ్మరం..

మరోవైపు, మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలోని సిట్ (SIT) అధికారులు విచారణను వేగవంతం చేశారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని భగీరథ్‌కు ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి. ఈ విచారణ ద్వారా మరిన్ని కీలక వివరాలను సేకరించాలని అధికారులు భావిస్తున్నారు. నేడు ఆయన విచారణకు వస్తారా లేదా అన్న అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి: Kavitha Demands Lookout Notice| బండి భగీరథ్​పై లుకౌట్ నోటీసులు ఇవ్వాల్సిందే: కవిత

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Gold ETF Surge | సుంకాల ప్రభావం.. భారీగా పెరిగిన ఈటీఎఫ్ లు

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Gold ETF Surge | ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల...

Kharif MSP Hike | రైతులకు గుడ్​న్యూస్​.. పంటలకు పెరిగిన మద్దతు ధర

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kharif MSP Hike | కేంద్ర ప్రభుత్వం...

Gold Import Duty | పెరిగిన దిగుమతి సుంకాలు.. ఒత్తిడిలో నగల కంపెనీల షేర్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold Import Duty | పశ్చిమాసియాలో జియో...

Stock Market Closing | హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్న ఇన్వెస్టర్లు.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Closing | దేశీయ స్టాక్ మార్కెట్...