జాతీయంKharif MSP Hike | రైతులకు గుడ్​న్యూస్​.. పంటలకు పెరిగిన మద్దతు ధర

Kharif MSP Hike | రైతులకు గుడ్​న్యూస్​.. పంటలకు పెరిగిన మద్దతు ధర

కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్​న్యూస్​ చెప్పింది. వానాకాలం సీజన్​కు సంబంధించి 14 రకాల పంటల మద్దతు ధర పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kharif MSP Hike | కేంద్ర ప్రభుత్వం (Central Government) రైతులకు గుడ్​న్యూస్​ చెప్పింది. పలు రకాల పంటల మద్దతు ధరను పెంచింది. వానాకాలం సీజన్​కు సంబంధించి 14 రకాల పంటల మద్దతు ధర పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

రైతులు (Farmers) తమ పంటలకు లాభదాయకమైన ధరలను పొందేలా చూడటానికి, 2026-27 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించిన ఖరీఫ్ పంటల MSPని ప్రభుత్వం పెంచింది. గత ఏడాదితో పోలిస్తే MSPలో అత్యధిక పెంపును పొద్దుతిరుగుడు గింజలు(క్వింటాల్‌కు కే,622) సిఫార్సు చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో పత్తి (క్వింటాల్‌కు రూ.557), నైజర్ సీడ్ (క్వింటాల్‌కు రూ. 515), నువ్వులు (క్వింటాల్‌కు రూ. 500) ఉన్నాయి.

Kharif MSP Hike | ధాన్యం రైతులకు..

రాష్ట్రంలో ఎక్కువ శాతం రైతులు వరి సాగు చేస్తారు. ఆ తర్వాతి స్థానాల్లో పత్తి, మొక్కజొన్న ఉంటాయి. ఈ సారి ధాన్యం మద్దతు ధరను కేంద్రం పెంచింది. దీంతో రైతులకు మేలు జరగనుంది. గతంలో ధాన్యం ఏ గ్రేడ్​ క్వింటాల్ ధర రూ.2,389 ఉండగా.. తాజాగా రూ. 72 పెరిగింది. దీంతో క్వింటాల్​కు రూ. 2,461కి చేరింది. సాధారణ ధాన్యం సైతం అంతే పెరిగి క్వింటాల్​ రూ 2,441కి చేరింది. పొద్దుతిరుగుడు పంట మద్దత ధర రూ. రూ. 622 పెరగడంతో క్వింటాల్​కు రూ.7,721 నుంచి రూ.8,343కి చేరింది.

Kharif MSP Hike | అత్యల్పంగా మక్కలు

హైబ్రిడ్ జొన్నల MSP రూ. 324 పెరిగి క్వింటాల్‌కు రూ. 4,023కి, సజ్జల MSP రూ. 125 పెరిగి క్వింటాల్‌కు రూ. 2,900కి చేరాయి. రాగి (చోళ్ళు) మద్ధతు ధర రూ. 319 పెరిగి క్వింటాల్‌కు రూ. 5,205కి చేరగా, మొక్కజొన్న అత్యల్ప పెంపు (రూ.10) నమోదైంది, దీంతో దాని ధర క్వింటాల్‌కు రూ. 2,410కి చేరింది. పప్పుధాన్యాల విషయానికి వస్తే, కందుల (Tur/Arhar) ధర రూ. 450 పెరిగి క్వింటాల్‌కు రూ. 8,450కి, మినుముల (Urad) రూ. 400 పెరిగి రూ. 8,200కి, పెసల (Moong) రూ. 12 పెరిగి క్వింటాల్‌కు రూ. 8,780కి చేరాయి.

ఇది కూడా చదవండి..: Gold Import Duty | పెరిగిన దిగుమతి సుంకాలు.. ఒత్తిడిలో నగల కంపెనీల షేర్లు

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bakrid Security Measures | బక్రీద్​ను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా చర్యలు తీసుకోవాలి.. డీజీపీ సీవీ ఆనంద్​

అక్షరటుడే నిజామాబాద్ క్రైం: Bakrid Security Measures | బక్రీద్​ను ప్రశాంత...

Uber Hyderabad Expansion| ఉబర్ ప్రతినిధులతో రేవంత్ భేటీ.. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Uber Hyderabad Expansion|తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉబర్ (Uber)...

Bandi Bhagirath Case | నాకు రెండు రోజుల సమయం కావాలి.. పోలీసులకు బండి భగీరథ్​ లేఖ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Bhagirath Case | కేంద్ర మంత్రి...

Russia India Relations| ఇంధన సరఫరాలో భారత్‌‌కు ఎలాంటి ఆటంకాలు ఉండవు : సెర్గీ లావ్రోవ్

అక్షరటుడే వెబ్‌డెస్క్:Russia India Relations|రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ త్వరలో...