తెలంగాణSingareni New Jobs | కొత్త గనులు, కొత్త ఉద్యోగాలే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి...

Singareni New Jobs | కొత్త గనులు, కొత్త ఉద్యోగాలే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి వివేక్​

సింగరేణికి పూర్వ వైభవం తెస్తామని మంత్రి వివేక్​ వెంకట స్వామి అన్నారు. మందమర్రి సింగరేణి ప్రాంతంలోని KK-5 గనిని ఆయన సందర్శించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Singareni New Jobs | సింగరేణికి పూర్వ వైభవం తెస్తామని మంత్రి వివేక్​ వెంకట స్వామి (Minister Vivek Venkat Swamy) అన్నారు. కొత్త గనులను తీసుకురావడం ద్వారా కొత్త ఉపాధి అవకాశాలను కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

కార్మిక, ఉపాధి, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గురువారం మందమర్రి సింగరేణి ప్రాంతంలోని KK-5 గని భూగర్భ విభాగానికి కార్మికులతో కలిసి వెళ్లారు. ఆయన గని లోపల పని పరిస్థితులను పరిశీలించారు, అలాగే కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. PRC బకాయిలకు సంబంధించిన ఆదాయపు పన్ను సమస్యలను పరిష్కరించాలని కార్మికులు కోరారు. అలాగే సొంత ఇల్లు కలిగి ఉండాలనే తమ కలను నెరవేర్చుకోవడంలో సహకరించాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు.

Singareni New Jobs | బీఆర్​ఎస్​పై విమర్శలు

మంత్రి మాట్లాడుతూ బీఆర్​ఎస్​ ప్రభుత్వ (BRS Government) హయాంలో సింగరేణిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. వారి హయాంలో సంస్థ ఆర్థికంగా దోపిడీకి గురైందన్నారు. ఒక్క కొత్త గనిని కూడా ప్రారంభించలేదని పేర్కొన్నారు. కార్మికులకు పూర్తి భద్రతా ప్రమాణాలను కల్పిస్తూనే, నాణ్యమైన బొగ్గు ఉత్పత్తిని సాధించడంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. అనంతరం KK-5 గని వద్ద ‘శ్రమ్ శక్తి’ పురస్కార గ్రహీత యెడుకోల పవన్ కుమార్ గౌరవార్థం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

Singareni New Jobs | టెండర్లలో పాల్గొంటాం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలకు అనుగుణంగా, బొగ్గు బ్లాకుల టెండర్లలో సింగరేణి పాల్గొనేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వెల్లడించారు. ఉద్యోగ విరమణ చేసిన కార్మికులకు రూ. 10 వేల పింఛను లభించేలా పార్లమెంటులో ఎంపీ వంశీ కృష్ణ కృషి చేస్తున్నారని తెలిపారు. RKP ఓపెన్‌కాస్ట్ ఫేజ్-2 ప్రాజెక్టు ద్వారా దాదాపు 5 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. అటవీ అనుమతులు అందిన వెంటనే గని పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Drugs Seizure | హైదరాబాద్​లో భారీగా డ్రగ్స్​ స్వాధీనం

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

RI Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్​ఐ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RI Caught by ACB | అవినీతి...

Nizamabad Police Commissionerate | అర్ధరాత్రి వరకు హోటల్​ ఓపెన్​.. జరిమానా విధించిన కోర్టు

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Police Commissionerate | నగరంలో అర్ధరాత్రి...

Municipal Water Supply | తాగునీటి సరఫరాపై మున్సిపల్​ కమిషనర్​ సమీక్ష

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Municipal Water Supply | నగరంలో...