Vivo X300 Ultra | ఫొటోగ్రఫీ లవర్స్ కోసం.. వీవోనుంచి మరో ఫోన్

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vivo X300 Ultra | చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో ఫొటోగ్రఫీ లవర్స్ కోసం మరో మోడల్ ను తీసుకువచ్చింది. 200 ఎంపీ ప్రైమరీ కెమెరా, 200 ఎంపీ పెరిస్కోపిక్ సెన్సార్, 50 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్, అధునాతన ప్రాసెసర్‌తో వివో ఎక్స్ 300 అల్ట్రా ను లాంచ్ చేసింది. గురువారం(మే 14) సేల్ ప్రారంభమైంది. వివో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లతోపాటు ఇతర రిటైల్ స్టోర్లలోనూ అందుబాటులో ఉంది. ఈ మోడల్ ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా..

డిస్‌ప్లే : 6.82 అంగుళాల 2కే ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లేతో తీసుకువచ్చారు. 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 300 హెడ్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంది.

Vivo X300 Ultra | ప్రాసెసర్..

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జన్ 5 ప్రాసెసర్ అమర్చారు. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేసే ఆరిజన్ ఓఎస6 ఉంది. ఐదేళ్లపాటు ఓఎస్ , ఏడేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది.

కెమెరా : ఓఐఎస్ తో కూడిన 200 ఎంపీ ప్రైమరీ కెమెరా, 200 ఎంపీ పెరిస్కోపిక్ సెన్సార్, 50 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50 ఎంపీ కెమెరా ఇచ్చారు. వెనక వైపు కెమెరాలతో 8కే వీడియో రికార్డ్ చేయొచ్చు.

బ్యాటరీ : 6600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ ను, 40 డబ్ల్యూ వైర్‌లెస్ ఫ్లాష్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది.

Vivo X300 Ultra | సింగిల్ వేరియంట్..

వివో ఎక్స్ 300 అల్ట్రా ఎక్లిప్స్ బ్లాక్, విక్టరీ గ్రీన్ రంగుల్లో సింగిల్ వేరియంట్‌లో లభిస్తుంది. 16జీబీ, 512జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,59,999. దీంతో పాటు వివో జీస్ టెలిఫొటో ఎక్స్‌టెండర్ జన్ 2 అల్ట్రాను కూడా విడుదల చేశారు. దీని ధర రూ. 27,999. వివో ఇమేజింగ్ గ్రిప్ కిట్ ధర రూ.11,999గా ఉంది.

కార్డ్ ఆఫర్లు : ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో 10శాతం వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 10 శాతం డిస్కౌంట్ తోపాటు అదనంగా రూ. 4 వేల వరకు క్యాష్ బ్యాక్ లభించనుంది.

ఇది కూడా చదవండి..: Korea Stock Market Rally | దుమ్ము రేపుతున్న కొరియన్ మార్కెట్.. ఏడాదిలో 225 శాతం ర్యాలీ!

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *