జాతీయంLPG Ships | హర్ముజ్​ను దాటిన రెండు ఎల్​పీజీ నౌకలు

LPG Ships | హర్ముజ్​ను దాటిన రెండు ఎల్​పీజీ నౌకలు

భారత్​కు ఎల్​పీజీ తీసుకు వస్తున్న రెండు నౌకలు హర్ముజ్​ జలసంధిని దాటినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : LPG Ships | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన హర్ముజ్​ జలసంధి (Strait of Hormuz) మీదుగా నౌకల రవాణా పూర్తిస్థాయిలో జరగడం లేదు. దీంతో అనేక దేశాలు ఇంధన, గ్యాస్​ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో భారత్​కు చెందిన రెండు ఎల్​పీజీ నౌకలు జలసంధిని దాటాయని కేంద్ర ప్రభుత్వం తెలిపంది.

ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ (Mukesh Mangal) గురువారం మీడియాతో మాట్లాడారు. బుధవారం రాత్రి రెండు ఎల్​పీజీ రవాణా నౌకలు హర్ముజ్​ మీదుగా ప్రయాణించాయని చెప్పారు. మార్షల్ ఐలాండ్ జెండా కలిగిన ‘సెహ్మి’ అనే నౌక భారత్​ కోసం 19,965 మెట్రిక్ టన్నుల ఎల్​పీజీ సరుకును తీసుకువస్తోందన్నారు. 21 మంది విదేశీ సిబ్బందితో వస్తున్న ఆ షిప్​ మే 16న కాండ్లాకు చేరుకుంటుందని అంచనా.

LPG Ships | 18న మంగళూరుకు..

వియత్నాం జెండా కలిగిన ‘ఎన్‌వి సన్‌షైన్’ అనే నౌక భారత్​ కోసం 46,427 మెట్రిక్ టన్నుల ఎల్​పీజీ తీసుకువస్తోంది. అందులో 24 మంది విదేశీ సిబ్బందితో ఉన్నారు. ఇది మే 18 న్యూ మంగళూరుకు చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. సోమాలియా నుంచి షార్జాకు ప్రయాణిస్తున్న ‘హాజీ అలీ’ అనే భారతీయ యాంత్రిక పడవ ప్రమాదానికి గురైంది. మే 13 తెల్లవారుజామున ఒమన్ జలాల్లో నౌకపై దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడి కారణంగా నౌకలో మంటలు చెలరేగి, అది మునిగిపోయింది. అందులోని 14 మంది సిబ్బందిని ఒమన్ కోస్ట్ గార్డ్ రక్షించారు.

దీనిని కూడా చదవండి : Delhi Fuel Saving Measures|ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం.. వారానికి రెండు రోజులు ‘వర్క్ ఫ్రమ్ హోమ్

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Inter Students | విద్యార్థులకు అలెర్ట్​.. ఇంటర్​లో కీలక మార్పులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Inter Students | తెలంగాణ ప్రభుత్వం (Telangana...

Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణాపై పోలీసుల కఠిన చర్యలు.. మూడు ట్రాక్టర్ల సీజ్​..

అక్షరటుడే, భీమ్​గల్: Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణాపై...

Khushbu | “నడకే జిమ్‌”… 32 కేజీలు తగ్గి ఆశ్చర్యపరిచిన నటి ఖుష్బూ ఫిట్‌నెస్ ప్రయాణం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khushbu | ఒకప్పుడు దక్షిణాది సినీ ప్రేక్షకుల గుండెల్లో...

Lingampet Police | నాటు తుపాకీతో కాల్చుకుని యువకుడి బలవన్మరణం

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Lingampet Police | నాటుతుపాకీతో కాల్చుకుని ఓ యువకుడి...