అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Formula E Race Case | ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది.
బీఆర్ఎస్ (BRS) హయాంలో హైదరాబాద్ (Hyderabad)లో ఫార్ములా ఈ కారు రేస్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో అక్రమాలు జరిగాయని, మంత్రివర్గ ఆమోదం లేకుండా నిధులు ఖర్చు చేశారని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. దీనిపై ఇప్పటికే ఏసీబీ పలుమార్లు వారిని విచారించింది. కేటీఆర్ ప్రాసిక్యూషన్ గవర్నర్ అనుమతి కూడా ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా కేటీఆర్‌కు కోర్టు సమన్లు జారీ చేయడం గమనార్మం.
Formula E Race Case | జులై 31న హాజరు కావాలి
కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్, హెచ్ఎండీఏ (HMDA) మాజీ ప్రధాన ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, క్రీడా సలహాదారు కిరణ్ మల్లేశ్వరరావులకు ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో విచారణ చేపట్టిన ఏసీబీ గతంలో ఛార్జీషిట్ దాఖలు చేసిన విషయం తెలిసింది. దానిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు జూలై 31న ఏసీబీ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ACB ఛార్జిషీటు ప్రకారం హైదరాబాద్‌లో 2023 ఫార్ములా ఈ కారు రేసు నిర్వహణ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఒక విదేశీ సంస్థకు సుమారు రూ.55 కోట్లు బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి : RI Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ


