బిజినెస్​Green CementTech 2026|హైదరాబాద్‌లో ‘గ్రీన్ సిమెంటెక్’ ప్రారంభం.. ‘నెట్ జీరో’ సిమెంట్ తయారే లక్ష్యం

Green CementTech 2026|హైదరాబాద్‌లో ‘గ్రీన్ సిమెంటెక్’ ప్రారంభం.. ‘నెట్ జీరో’ సిమెంట్ తయారే లక్ష్యం

పర్యావరణ హితమైన సిమెంట్ తయారీ , సాంకేతిక పురోగతిపై చర్చించేందుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) నిర్వహిస్తున్న ‘గ్రీన్ సిమెంటెక్ 2026’ 22వ ఎడిషన్ గురువారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ప్రారంభమైంది.

అక్షరటుడే వెబ్‌డెస్క్:Green CementTech 2026|పర్యావరణ హితమైన సిమెంట్ తయారీ , సాంకేతిక పురోగతిపై చర్చించేందుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) నిర్వహిస్తున్న ‘గ్రీన్ సిమెంటెక్ 2026’ 22వ ఎడిషన్ గురువారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ప్రారంభమైంది. గ్రీన్ బిజినెస్ సెంటర్ (CII-GBC) , సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (CMA) సంయుక్తంగా చేపట్టిన ఈ సదస్సులో దేశవిదేశాలకు చెందిన సుమారు 400 మంది పరిశ్రమ ప్రతినిధులు, శాస్త్రవేత్తలు , విధాన నిర్ణేతలు పాల్గొన్నారు.

Green CementTech 2026|నెట్ జీరో కార్బన్ దిశగా ప్రయాణం..

సదస్సు ప్రారంభోత్సవంలో అల్ట్రాటెక్ సిమెంట్ బిజినెస్ హెడ్ ఈఆర్ రాజ్ నారాయణన్ మాట్లాడుతూ.. నెట్ జీరో కార్బన్ వైపు ప్రయాణం’ అనే ప్రధాన లక్ష్యంతో భారతీయ సిమెంట్ రంగం ముందుకు సాగుతోందని అన్నారు. దేశ ఆర్థికాభివృద్ధిలో , వికసిత్ భారత్ నిర్మాణంలో సుస్థిరమైన మౌలిక సదుపాయాలు అత్యంత కీలకమని, అందుకోసం తక్కువ కార్బన్ ఉద్గారాలతో కూడిన సిమెంట్ తయారీపై దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

Green CementTech 2026|గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ..

ఐజీబీసీ నేషనల్ చైర్మన్ సి. శేఖర్ రెడ్డి ప్రసంగిస్తూ.. గ్రీన్ బిల్డింగ్‌ల నిర్మాణంలో తక్కువ కార్బన్ పదార్థాల ప్రాముఖ్యతను వివరించారు. మరోవైపు, రీ సస్టైనబిలిటీ లిమిటెడ్ సీఈఓ మసూద్ మల్లిక్ సిమెంట్ పరిశ్రమలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) , సరికొత్త ఆవిష్కరణల అవసరాన్ని నొక్కి చెప్పారు. వ్యర్థాల నిర్వహణ , వనరుల సమర్థవంతమైన పునర్వినియోగం ద్వారా పర్యావరణ లక్ష్యాలను చేరుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.

Green CementTech 2026|అత్యాధునిక సాంకేతికతల ప్రదర్శన..

ఈ సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన ఎక్స్‌పోలో సుమారు 50 మందికి పైగా ఎగ్జిబిటర్లు ఇంధన సామర్థ్యం , స్మార్ట్ తయారీ రంగాలకు చెందిన అత్యాధునిక పరిష్కారాలను ప్రదర్శించారు. అలాగే ‘కార్బన్ క్యాప్చర్’ సాంకేతికతలపై రూపొందించిన ప్రత్యేక ప్రచురణను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. కర్బణ ఉద్గారాలను తగ్గించి, డిజిటల్ పరంగా అభివృద్ధి చెందిన సిమెంట్ పరిశ్రమను నిర్మించే దిశగా ఈ రెండు రోజుల సదస్సు మే 15 వరకు కొనసాగనుంది.

ఇది కూడా చదవండి: Formula E Race Case | ఫార్ములా ఈ-రేస్‌ కేసులో కేటీఆర్‌కు కోర్టు సమన్లు

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

SI Love Fraud | ప్రేమ పేరుతో మహిళా కానిస్టేబుల్‌కు ఎస్సై టోకరా.. కటకటాల్లో కీచక ఖాకీ!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SI Love Fraud | రక్షణ కల్పించాల్సిన రక్షక...

Inter Students | విద్యార్థులకు అలెర్ట్​.. ఇంటర్​లో కీలక మార్పులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Inter Students | తెలంగాణ ప్రభుత్వం (Telangana...

Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణాపై పోలీసుల కఠిన చర్యలు.. మూడు ట్రాక్టర్ల సీజ్​..

అక్షరటుడే, భీమ్​గల్: Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణాపై...

Khushbu | “నడకే జిమ్‌”… 32 కేజీలు తగ్గి ఆశ్చర్యపరిచిన నటి ఖుష్బూ ఫిట్‌నెస్ ప్రయాణం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khushbu | ఒకప్పుడు దక్షిణాది సినీ ప్రేక్షకుల గుండెల్లో...